Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ( BRS) ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో మెడికల్ కాలేజీలు ప్రారంభించిందన్నారు. కానీ, 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రెటరీ, డీఎంఈ ఎన్ఎంసీ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని తాఖీదులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేతగానితనానికి నిదర్శనం అన్నారు.
Also Read: GHMC: వర్క్ ఏదైన డీసీలు జడ్సీల ప్రమేయం ఉండేలా చర్యలు!
విద్యార్థుల భవిష్యత్‌కు ఎవరు భరోసా
ఈ విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం కమిటీ వేయడం హాస్యాస్పదం అన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, (Revanth Reddy) 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్‌కు ఎవరు భరోసా అని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతున్నదన్నారు. ఎన్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖను మీకు పంపిస్తున్నానని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడాలని కోరారు. తక్షణమే మెడికల్ కళాశాలలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థులు జీవితాలను నిలబెట్టాలని సూచించారు.
ప్రభుత్వానికి స్పష్టత లేదు..
రుణమాఫీ, రైతుభరోసా, యువవికాసం, ఇలా అన్ని అంశాల్లోనూ రేవంత్ ( Revanth Reddy) ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన రాష్ట్రంలో చేసిందేమీ లేదన్నారు. కానీ, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం సిద్ధమైందన్నారు. సీఎం (Cm) క్యాంపు కార్యాలయం కోసం రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్లడం అంటే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు అన్నట్లేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే, 30టీఎంల నీళ్లు ( Hyderabad) హైదరాబాద్‌కి ఎక్కడ నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు.
గోదావరి, బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్, లేఖల ఆధారంగానే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. 90శాతం విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. రేవంత్ (Revanth Reddy) ప్రభుత్వంలో పనిచేసే వారికి ఈ విషయాలు తెలియవు, నేర్చుకోరని ఎద్దేవా చేశారు. గోదావరి బనకచర్ల గురించి ఇప్పటికే చాలాసార్లు తాను మాట్లాడానని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి (Kishan Reddy) కూడా లేఖ రాశానని గుర్తుచేశారు. తాను ఉన్న వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ (Congress) నేతలు లీకులు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: CM Revanth Reddy: నాయకులు క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలి!