Phone Tapping Case (imagcredit:twitter)
తెలంగాణ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సాక్ష్యం ఇవ్వటానికి రానున్న పీసీసీ ఛీఫ్

Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు రానున్నారు. కాగా, ఈసారి విచారణను మరింత కట్టుదిట్టంగా చెయ్యాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ట్యాపింగ్ బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవటంతోపాటు వారి ఎదురుగానే ప్రభాకర్ రావును ప్రశ్నించాలని నిశ్చయించారు. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను సాక్షిగా నేడు సిట్ ఆఫీస్‌కు రావాలని సూచించారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారన్న పటోళ్ల మహిపాల్ రెడ్డి నుంచి కూడా సాక్ష్యాలు తీసుకొనున్నారు. మరికొందరు ట్యాపింగ్ బాధితులను కూడా పిలిపించి వాంగ్మూలాలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్నాళ్లకే వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అన్ని వర్గాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

హార్డ్ డిస్కుల ధ్వంసం

దీనిపై కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. విశ్వ ప్రయత్నాల తర్వాత ప్రభాకర్ రావు సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత సిట్ విచారణకు హాజరవుతూ వస్తున్నారు. అయితే, ఇంతకుముందు రెండుసార్లు ప్రశ్నించినపుడు ప్రభాకర్ రావు విచారణకు పెద్దగా సహకరించ లేదు. హార్డ్ డిస్కులను ధ్వంసం చెయ్యాలని తాను ప్రణీత్ రావుకు చెప్పలేదన్నారు. మావోయిస్టుల పేరుతో వేర్వేరు పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగానికి చెందిన వారి నంబర్లను ఎందుకు? ట్యాప్ చేయించాల్సి వచ్చింది. ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారు? అని ప్రశ్నించగా సూటిగా జవాబులు ఇవ్వలేదు. నేనేం చేశానో అంతా నా పై అధికారులకు తెలుసు అని చెప్పారు. ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన రోజు ప్రభాకర్ రావు ఆయనకు చేసిన ఫోన్ కాల్స్ లిస్టును ముందు పెట్టి ప్రశ్నిస్తే కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు.

Also Read: Ponguleti Srinivas Reddy: నిర్దేశించిన గడువులోగా భూ స‌మ‌స్యల ప‌రిష్కారం!

ప్రభాకర్ రావు పరోక్షంగా ఒప్పుకున్నారా

కాల్స్ చేసి ఉంటా హార్డ్ డిస్కులను ధ్వంసం చెయ్యమని చెప్పలేదంటూ మీరు వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అలా చెప్పినట్టు అని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని అడిగితే అంతా నాపై అధికారులకు తెలుసు అని చెప్పారు. ఇలా చెప్పి తాను ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టు ప్రభాకర్ రావు పరోక్షంగా ఒప్పుకున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్యాపింగ్ బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుని ప్రభాకర్ రావును మరింత నిశితంగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు వెళ్లడైన క్రమంలో నేడు సిట్ ఆఫీస్ కు వచ్చి సాక్ష్యధారాలు ఇవ్వాలని దర్యాప్తు అధికారులు కోరారు.

ఈ నేపథ్యంలో ఉదయం11 గంటలకు మహేశ్ కుమార్ గౌడ్ సిట్ ఆఫీస్‌కు రానున్నారు. ఇక, మరో కాంగ్రెస్ నాయకుడు మేరుగు రమేశ్ రెడ్డి సోమవారం సిట్ ఆఫీస్ కు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. తనతోపాటు తన సన్నిహితుల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేయించారని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరికొందరు ట్యాపింగ్ బాధితులు కూడా సిట్ ఆఫీస్ కు వచ్చారు. బాధితుల్లో కీలకమైన వారితో కూర్చోబెట్టి ప్రభాకర్ రావును ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించారు.

Also Read: MissTerious: నాగభూషణం మనవడు హీరోగా చేస్తున్న చిత్రానికి మంత్రి సపోర్ట్

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?