rahul gandhi
Politics, Top Stories

Rahul Gandhi: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. నామినేషన్ దాఖలు

UttarPradesh: రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే ఉత్కంఠ వీడింది.
ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నామినేషన్ దాఖలు
చేశారు. రాయ్‌బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి రాహుల్ గాంధీ నామినేషన్ ఫైల్ చేశారు. ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలు
సహా పలువురు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఉత్తరప్రదేశ్‌ నుంచి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ పలుమార్లు గెలిచారు. కానీ, గత
ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందారు. రాహుల్ గాంధీ రెండో నామినేషన్‌గా
వేసిన వయనాడ్ నుంచి మంచి మెజార్టీతో గెలిచారు.

Also Read: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. రేపు నల్లమల అడవిలోకి

ఈ సారి కూడా వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వయనాడ్‌కు నామినేషన్ దాఖలు, చేయడం..
అక్కడ ప్రచారం చేయడం, ఓటింగ్ కూడా ముగిసింది. గతేడాది తరహాలోనే ఈ సారి కూడా రాహుల్ గాంధీ
రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీ, అమేథీ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటల వంటివి. కానీ, ఈ
ఏడాది గాంధీ కుటుంబం ఈ రెండు స్థానాలను చేజార్చుకుంటున్నదనే చర్చ జరిగింది. ఎందుకంటే
సోనియా గాంధీ ఈ సారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడం లేదు. ఆమె అనారోగ్య కారణాల వల్ల రాజస్తాన్
నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు.

Just In

01

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?