Uppu Kappurambu
ఎంటర్‌టైన్మెంట్

Uppu Kappurambu: కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!

Uppu Kappurambu: థియేటర్లలో సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ఓటీటీల్లో అంత ఘనంగా ఉంది. కొన్ని ఓటీటీలు సరికొత్త పంథాలో వీక్షకులను పెంచుకునే పని చేస్తున్నాయి. ఫ్యూచర్ ఓటీటీలదే అని తలపించేలా టీమ్ రంగంలోకి దిగి డైరెక్ట్‌గా సినిమాలను నిర్మిస్తోంది. అలా ఈ కల్చర్ ఇప్పుడు తెలుగు సినిమాల వైపు కూడా వచ్చేసింది. నిజంగా ఇదే కంటిన్యూ అయితే మాత్రం.. ఓటీటీలో ఇతర సినిమాలను తీసుకోవడం మానేస్తాయి. అప్పుడు నిర్మాతలు ఆటోమేటిగ్గా సినిమాలు తీయడం మానేస్తారు. ఎందుకంటే, థియేటర్లలో సినిమాలు సక్సెస్ అయినా, అవకపోయినా.. రైట్స్ రూపంలో వచ్చే అమౌంట్‌తో గట్టెక్కెయవచ్చని భావిస్తుంటారు. ఇప్పుడా హోప్ కూడా చేజారితే.. ఇక నిర్మాతలెవరూ ముందుకు రారు. అప్పుడిక థియేటర్లు వెలవెల పోవడమే కాదు.. అందరికీ ఓటీటీలే దిక్కవుతాయి. సరే విషయంలోకి వస్తే..

Also Read- Director Maruthi: సాగదీయను.. ‘ది రాజా సాబ్’ పార్ట్ 2‌పై మారుతి కామెంట్స్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఉప్పు కప్పురంబు’ అనే చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. విషయం ఏమిటంటే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ స్వయంగా నిర్మించడం. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌తో కలిసి ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని నిర్మించింది. రాధిక లావు నిర్మాత. ఐ.వి. శశి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సుహాస్, బాబు మోహన్, శత్రు తళ్లూరి రామేశ్వరి వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూలై 4వ తేదీని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ప్రైమ్ వీడియో ప్రీమియర్‌కు తీసుకొస్తుంది. సెటైరికల్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్బింగ్‌తో ప్రసారం చేయనున్నారు.

వసంత్‌ మురళీకృష్ణ మరింగంటి కథని అందించిన ఈ చిత్రం 90స్ బ్యాక్‌డ్రాప్‌లో దక్షణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతమైన చిట్టి జయపురం అనే గ్రామంలోని వసతులు, మౌళిక సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా జరిగే పోరాటాన్ని తెలియజేస్తుందని, ఇందులో ప్రతి పాత్ర హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఎటువంటి వల్గారిటీ లేకుండా అర్థవంతమైన కామెడీతో, సమాజంలో తీవ్రంగా పరిగణిస్తున్న కొన్ని సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సినిమా ఉంటుందని వారు చెబుతున్నారు.

Also Read- Dhanush: పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది.. ‘కుబేర’ వేడుకలో ధనుష్ సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ విడుదలను పురస్కరించుకుని ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, ఒరిజినల్స్ హెడ్ అయిన నిఖిల్ మధోక్ సంతోషం వ్యక్తం చేశారు. మా పరిధిని మరింత విస్తృతం చేయడానికి, ఇకపై ఇలాంటి వైవిధ్యమైన కథలతో వీక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. ఎల్లనార్ ఫిల్మ్స్‌తో కలిసి పనిచేయడం, కీర్తి సురేష్, సుహాస్ వంటి ప్రతిభావంతులైన తారాగణంతో పాటు.. ఐ.వి. శశి రూపొందించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూసేందుకు ఎంతగానో వేచి చూస్తున్నానని దర్శకుడు ఐ.వి. శని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు