Mahesh Goud on Srinivas: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. క్యాబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖలోని అంశంపైన వేరొకరు మాట్లాడటమేంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాగ్రత్తగా మాట్లాడాలి: టీపీసీసీ చీఫ్
కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అలాంటి అంశాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని మంత్రులకు టీపీసీసీ చీఫ్ సూచించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాట్లాడాలని సెన్సిటివ్ అంశాలను, కోర్టు పరిధిలో అంశాలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Sobhita Dhulipala: మరిది అఖిల్ పెళ్లి.. టాప్ సీక్రెట్ చెప్పేసిన శోభిత.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
పొంగులేటి ఏమన్నారంటే?
గురువారం మీడియాతో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ నెలఖరు లోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రకటించారు. మొదటగా ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ ZPTC) ఎన్నికలు.. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని కీలక ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి కేబినేట్ (Telangana Cabinet) లో చర్చించి.. తేదీపై స్పష్టత ఇస్తామని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.