Tummala Nageswara Rao:(image credit: swetcha reporter)
తెలంగాణ

Tummala Nageswara Rao: రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో ప్రారంభం!

Tummala Nageswara Rao: నేటి నుంచి రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభమవుతున్నది. రాష్ట్రంలోని 1034 రైతు వేదికల్లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దీనిని ప్రారంభిస్తున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆడిటోరియంలో దాదాపు 1500 మంది రైతులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు.

రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవం ఏర్పాట్లను యూనివర్సిటీలో సంబంధిత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummla Nageswar rao) సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 రైతు వేదికలలో, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేశామని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి, ఆదర్శ రైతుల అనుభవాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతుల (Farmers) ప్రతీ మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా, వివిధ రైతుల (Farmers) అనుభవాలను తెలుసుకున్నారని చెప్పారు.

 Also Read: Mahabubabad: అక్రమ కేసులు ఎత్తివేయాలి.. నల్ల చట్టాలను రద్దు చేయాలి!

సీఎం ముఖాముఖి

తొలకరి ఆరంభమై వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న వేళ, రాష్ట్రవ్యాప్తంగా వున్న రైతు వేదికల్లో హాజరైన (Farmers) రైతులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు 78,000 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేశామని తుమ్మల (Thummla Nageswar rao) తెలిపారు. ప్రభుత్వం కొత్త పథకాలను ఇప్పటికే అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒక దశ, దిశ చూపించిందని, రుణ మాఫీ, సన్న ధాన్యానికి బోనస్, అన్ని రకాల పంటలను మద్ధతు ధరకు కొనుగోలు, అన్ని పంటలకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పరికరాల సరఫరా వంటివి మచ్చు తునక అన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న రైతు వేదికల నుంచి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు, (Farmers) పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

 Also Read: KTR: నేడు ఏసీబీ ఎదుటకు కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ!

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు