Minister Seethakka criticise kcr
Politics

Seethakka: కేసీఆర్ ను నమ్మే స్థితిలో లేరు

Minister Seethakka: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కల్వకుంట్ల ఫ్యామిలీని నమ్మబోరని ప్రత్యేకంగా కేసీఆర్ మాయమాటలను అస్సలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి సీతక్క విమర్శించారు. గురువారం మంత్రీ సీతక్క ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం పరిధిలోని పలు గ్రామాలను సందర్శించారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఈ మేరకు ఆలూరు, మలక్ చించోలి, బీరవెల్లి గ్రామాలలో డీసీపీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి ఆలూరులో ేర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని అన్నారు. ఇకపై ఆ పార్టీ ఉండదని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ మాయ మాటలను ప్రస్తుతం ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వస్వం త్యాగం చేసిందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి 15 సీట్ల కట్టబెట్టాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. మోదీ ప్రధాని కాక ముందు రూ.25 వేలు ఉన్న తులం బంగారం నేడు రూ.85 వేలకు పెరిగిందని అన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచారని, ఎన్నికలు రాగానే రూ.వంద తగ్గించారని ఎద్దేవా చేశారు.

మోదీ పాలనలో కార్పొరేట్లు బాగుపడ్డారు

మోదీ పాలనలో ప్రజలకు చేసింది ఏమి లేదని, కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా.. ఆదిలాబాద్ ఉమ్మడి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, పార్టీ మండలాధ్యక్షుడు బొల్లోజీ నర్సయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజమొహమ్మద్, ఎంబడి రాజేశ్వర్, అల్లూరి మల్లారెడ్డి, అల్లూరి వేణి, నారాయణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి, తేజునాయక్, పోతారెడ్డి, ముత్యం‌రెడ్డి, విలాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు