Mahabubabad( IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Mahabubabad: అక్రమ కేసులు ఎత్తివేయాలి.. నల్ల చట్టాలను రద్దు చేయాలి!

Mahabubabad: భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల (Left Wing Parties) నాయకులు డిమాండ్ చేశారు.  మహబూబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంలో నాడు నల్ల చట్టాలు రద్దు చేయాలని చేసిన పోరాటంలో భాగంగా పెట్టిన అక్రమ కేసుల లో వామపక్ష నేతలు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల (Left Wing Parties) నాయకులు బి విజయసారథి, సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, మదర్, గుజ్జు దేవేందర్, హలవత్ లింగ్య నాయక్ పెరుగు కుమార్, రేశ పల్లి నవీన్, ఆకుల రాజు, గుణగంటి రాజన్న, వరిపల్లి వెంకన్న, సమ్మెట రాజమౌళి, సామ పాపయ్య, చొప్పరి శేఖర్, మేక వీరన్న, తండా మాధవి, కుంట ఉపేందర్ గౌని వెంకన్న కోర్టుకు హాజరయ్యారు.

 Also Read: Ponguleti Srinivas Reddy: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి హామీ!

ప్రధాని మోడీ రాజీనామా చేయాలి

ఈ సందర్భంగా వామపక్ష నేతలు బి విజయ సారథి సాధుల శ్రీనివాస్ మండల వెంకన్న లు మాట్లాడుతూ.. రైతులను మోసం చేస్తున్న ప్రధాని మోడీ రాజీనామా చేయాలి అన్నారు నల్ల చట్టాలు రద్దు చేయకపోతే ఆందోళన తప్పదు అన్నారు అక్రమ కేసులను ఎత్తివేయకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు కార్పొరేట్ సంస్థలకే ఊడిగం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) రాజీనామా చేయాలన్నారు దొడ్డిదారిన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ (Narendra Modi) కార్మికు చట్టాలను హరిస్తున్నాడు అన్నారు. చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఈ ప్రభుత్వానికి మద్దతు లేదన్నారు. వారు వెంటనే ఉపసంహరించుకొని బిజెపిని బర్తరఫ్ చేయాలన్నారు.

 Also Read: Government Aims: 540 నుంచి 5 వేలకు పైగా ప్రైమరీ స్కూళ్లకు విస్తరణ!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?