Dhanush at Kuberaa event
ఎంటర్‌టైన్మెంట్

Dhanush: పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉంది.. ‘కుబేర’ వేడుకలో ధనుష్ సంచలన వ్యాఖ్యలు

Dhanush: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయాలని ఉంది అన్నారు కోలీవుడ్ స్టార్ ధనుష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఎంత బిజీగా ఉన్నారో తెలియంది కాదు. ప్రస్తుతం ఆయన ఇప్పటి వరకు ఓకే చేసిన ప్రాజెక్ట్స్‌ని పూర్తి చేసి.. రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Chaitu and Samanatha: నాగ చైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారా?

ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ.. తెలుగు హీరోల్లో మీరు ఎవరిని డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు ధనుష్. అంతే.. ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లింది. ఈలలు, క్లాప్స్‌తో స్టేడియం మారుమోగింది. ఇక ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. ఓం నమ: శివాయ. ఇక్కడ ప్రదర్శించిన ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నే గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారు. ఈరోజు ఇక్కడ ఇలా వుండటానికి కారణం ఆయన కష్టమే. ఈ సందర్భంగా నాన్నకి కృతజ్ఞతలు (ఫాదర్స్ డే స్పెషల్‌‌గా ఆయన తన తండ్రిని గుర్తు చేసుకున్నారు).

Also Read- Dil Raju: ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? దిల్ రాజు ఫైర్!

సినిమా ‘కుబేర’ విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తన హెల్త్‌ని కూడా లెక్క చేయకుండా ఈ సినిమా కోసం పని చేశారు. ఆయన విషయంలో చాలా కంగారు పడ్డాను. ‘కుబేర’ నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా. సార్ సినిమాకి ముందే శేఖర్ సార్ ఈ కథ నాకు చెప్పారు. నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందంగా ఉంది. కుబేరలో అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. నాగార్జున సార్‌తో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియెన్స్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి నటించడం నిజంగా మ్యాజికల్ ఎక్స్‌పీరియెన్స్. రష్మిక మందన్నా చాలా హార్డ్ వర్క్ చేసింది. తను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. నిర్మాతలకు థ్యాంక్యూ. వారు లేకపోతే ఈ సినిమానే లేదు. నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘కుబేర’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. సినిమా విడుదల తర్వాత అందరికీ స్పెషల్ ఫిల్మ్ అవుతుంది. జూన్ 20 థియేటర్లలోకి వస్తుంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకముందని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!