Akhanda 2 Update
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2: ‘అఖండ 2’.. తాజా అప్డేట్ ఇదే!

Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్ర ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం.. బాలయ్య, బోయపాటి నాల్గవ‌సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. అన్నీ కూడా ‘అఖండ’ మించి ఉంటాయని చిత్రయూనిట్ చెబుతూ వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Dil Raju: ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? దిల్ రాజు ఫైర్!

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్ర టీజర్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. టీజర్ తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్ర అప్డేట్ ఏమిటంటే.. ఇటివలే జార్జియాలోని గ్రాండ్ లోకేషన్స్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుని వచ్చిన టీమ్.. చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్‌కు రెడీ అవుతోంది. సోమవారం నుంచి కొత్త షూటింగ్ షెడ్యూల్, హైదరాబాద్ ఆర్ఎఫ్‌సీలో ప్రారంభమవుతుందని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ షెడ్యూల్‌లో నటసింహం బాలకృష్ణతో పాటు యూనిట్ అంతా పాల్గొంటారని, సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నామని టీమ్ తెలిపింది.

Also Read- Salman Khan Marriage: నేను పెళ్లి చేసుకుంటా.. రిజెక్ట్ చేసిన అమ్మాయిని మర్చిపోలేను.. సల్మాన్ ఖాన్ కామెంట్స్

‘అఖండ 2’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేలా, బోయపాటి అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పేసింది. నటసింహం కూడా ఈ సినిమాపై యమా కాన్పిడెంట్‌గా ఉన్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్యకు, ఈ సినిమా కూడా మరో బంపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. బాలయ్య, బోయపాటి అంటే చాలు ఫ్యాన్స్‌కి ఆ మాత్రం నమ్మకం, హైప్, పూనకాలు ఉండనే ఉంటాయి. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘సరైనోడు’ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్ థమన్ మరోసారి ఈ సినిమా కోసం ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసినట్లుగా హింట్ వచ్చేసింది. ఇక థియేటర్లలో వీరంగమే మిగిలి ఉంది. అది ఈ దసరాకు డబుల్లో ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?