Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా సరిత విధుల్లో చేరారు. ప్రజాప్రభుత్వంలో ఆమె విధులు నిర్వహించడం రికార్డు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఆమె ఆర్టీసీ జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్ గా విధుల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుంది. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు రుణసదుపాయం సైతం కల్పిస్తుంది. మరోవైపు డ్రైవర్లుగాను రాణించేందుకుతోడ్పటు అందజేస్తుంది.
గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో
డ్రైవర్ సరితది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండా. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో డ్రైవర్ వృత్తిని ఎంచుకుంది. గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో 10 సంవత్సరాలు డ్రైవర్‌గా విధులు నిర్వహించారు. కుటుంబ పరిస్థితుల దృశ్య తనకు స్వస్థలంలో డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో జేబీఎం సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ డిపో నుంచి నియమించారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ రూట్‌లో డ్యూటీ వేశారు. విధులు నిర్వహిస్తుంది.
Also Read: MLC Kavitha: కవిత బీఆర్ఎస్ మధ్య గ్యాప్.. ఈ మౌనం దేనికి సంకేతం?
పురుషులతో సమానంగా
ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు తాజాగా ఆర్టీసీలో మహిళా డ్రైవర్‌గా అవకాశం ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ వి.సరితను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సరిత ఆదర్శంగా నిలుస్తున్నారు.
నాలాగా కొద్ది మందిమహిళలు రావాలి: డ్రైవర్ సరిత
ఆర్టీసీలో నాలాగా కొద్ది మంది మహిళలు డ్రైవర్లుగా రావాలి. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఈ రంగంలోనూ రాణించి సత్తాచాటాలన్నదే నా కోరిక. ఢిల్లీకన్న వాతావారణం, రోడ్లు తెలంగాణలో బాగున్నాయి. అక్కడ వాహనాల రద్దీతో చాలా ఇబ్బందులు ఉండేవి. ఇక్కడ సాఫీగా బస్సును నడుపుతున్నా. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులో అన్ని అధునాతన వసతులు ఉన్నాయి. ఇండియాలోనే బస్సు డ్రైవర్‌గా పనిచేశాను. కుటుంబ పరిస్థితులతో స్వరాష్ట్రానికి వచ్చాను. మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు డ్రైవర్‌గా అవకాశం కల్పించారు. మంత్రికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలని అన్నారు.
Also Read: Zipline Mishap: పాపం పదేళ్ల బాలిక.. 30 అడుగుల ఎత్తు నుంచి..