Yamudu: ఇటీవల ‘యముడు’ పేరుతో ఓ పోస్టర్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి (Jagadeesh Amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ‘యముడు’ చిత్రానికి ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ట్యాగ్ లైన్. శ్రావణి శెట్టి (Sravani Setti) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్.. ఇలా అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను (Yamudu Dharmo Rakshathi Lyrical Song) మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. అలాగే టాప్‌లోనూ ట్రెండ్ అవుతోంది.
‘‘ధర్మో రక్షతి రక్షితః.. యమధర్మో రక్షతి పాప శిక్షతి
ధర్మో రక్షతి రక్షితః.. కలి పాపం శిక్షతి లోక రక్షితి
సంజా సూర్యుల ప్రథమ సుతుడా.. అసురుల మానవ ప్రాణ హరుడా..
నరకలోకమున ధర్మకరుడా.. మృత్యలోకమున శక్తిపరుడా..
రణ గణ ధ్వనులతో రాకవుందా.. భగ భగ రగిలే కనుల నిండా..
నిశి మసి పూసిన కండలుండా.. యమహో యమహో అగ్రజుండా..
హరా.. హరోం హర.. ఇదే నీ ఆజ్ఞరా..’’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్‌తో.. పాటకు పర్ఫెక్ట్‌గా సెట్టయిన స్వరాలతో వినగానే ఆకర్షించేలా ఈ పాటను మలిచారు. ఈ మధ్యకాలంలో అయితే యముడిపై ఇటువంటి పాట రాలేదనే చెప్పుకోవాలి. యముడిపై చాలా గొప్ప సాంగ్‌ని మేకర్స్ క్రియేట్ చేశారు.
Also Read- Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ట్రైలర్ వచ్చేసింది.. టాక్ ఏంటంటే?
ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని చక్కని సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు. భవానీ రాకేష్ అందించిన బాణీలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా సాగిన ఈ పాట.. యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. లిరికల్ వీడియోను కూడా ఇంపుగా డిజైన్ చేశారు. ఈ పాట ఈ సినిమా ఏ స్థాయిలో రూపుదిద్దుకుంటుందో తెలియజేసేలా ఉంది. ఈ పాటతో సినిమాపై పాజిటివ్ ఫీల్ ఏర్పడుతోంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి త్వరలోనే ఓ మంచి రిలీజ్ డేట్ చూసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. ఇకపై ‘యముడు’ నుంచి కంటిన్యూగా అప్డేట్స్ ఉంటాయని, తాజాగా విడుదలైన ‘ధర్మో రక్షతి’ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు