Anirudh And Kavya Maran
ఎంటర్‌టైన్మెంట్

Anirudh Ravichander: ‘సన్ రైజర్స్’ కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి.. మ్యాటర్ ఇదే?

Anirudh Ravichander: ఐపీఎల్ జరిగినన్నీ రోజులు, ఇంకా చెప్పాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మ్యాచ్ జరిగే సమయంలో బాగా వైరల్ అయ్యే పేరు ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా కావ్య మారన్ (Kavya Maran) పేరే. అందరూ కావ్య పాప అంటూ పిలుచుకునే ఈ భామ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని గ్రౌండ్‌లో ఎలా ఉత్సాహపరుస్తూ ఉంటుందో అంతా చూస్తూనే ఉంటారు. గ్రౌండ్‌లో ఆమె ఇచ్చే మూమెంట్స్ అందరిలో హుషారుని తెప్పిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఎందరో ఆడవాళ్లకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అంత చిన్న వయసులో.. ఒక టీమ్‌ని లీడ్ చేయడం, డేరింగ్‌గా నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటితో.. కావ్య పాపని బీభత్సంగా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఐపీఎల్‌లో వేరే టీమ్ ఓనర్ ఎగతాళి చేసినా, ధైర్యంగా నిలబడి.. తన నిర్ణయాన్ని ఎంత కరెక్టో చూపించి, అతనికి ఇచ్చిపడేసింది. అప్పటి నుంచి కావ్య పాప ఫాలోయింగే వేరు. సరే అసలు విషయంలోకి వస్తే..

Also Read- Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ ట్రైలర్ వచ్చేసింది.. టాక్ ఏంటంటే?

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌కు, కావ్య పాపకు త్వరలోనే పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సీఈవో కావ్య మారన్, కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ కొన్నాళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అతి త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నారనేలా కోలీవుడ్‌ మీడియాలోనే కాకుండా, సోషల్ మీడియాలో సైతం వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో అంతా నిజమేనని అనుకుంటున్నారు. కావ్య మారన్ ఎవరో కాదు.. కోలీవుడ్ నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె. ‘జైలర్’, ‘రాయన్’ వంటి చిత్రాలను నిర్మించిన, ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందే చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత. సన్ పిక్చర్స్ నుంచి సినిమా వస్తుందంటే ఉండే హైపే వేరు. ఈ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న గత కొన్ని చిత్రాల నుంచి వరుసగా అనిరుధ్ రవిచందరే సంగీతం అందిస్తూ వస్తున్నారు.

Also Read- Niharika Konidela: మెగా గుడ్ న్యూస్.. సీక్రెట్‌గా నిహరిక ఎంగేజ్మెంట్.. మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్?

మరి ఇది కారణమో, లేదంటే వేరే ఎక్కడైనా ఈ జంట కనిపించారో తెలియదు కానీ, సోషల్ మీడియాలో సడెన్‌గా కావ్య, అనిరుధ్ పెళ్లంటూ వార్తలు మొదలయ్యాయి. ‘మీరూ మీరూ కలిసిపోయారా?’ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో వీళ్లిద్దరి పేర్లు ట్రెండ్‌లోకి కూడా వచ్చేయడం విశేషం. అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని తాజాగా అనిరుధ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మ్యారేజా.. కాస్త ప్రశాంతంగా ఉండండి.. రూమర్స్ ప్రచారం చేయడం ఆపండి’ అంటూ అనిరుధ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక అనిరుద్ పోస్ట్‌కు నెటిజన్లు రియాక్ట్ అవుతున్న తీరు, చేస్తున్న కామెంట్స్.. అబ్బో చెప్పడం కష్టం.. చూసి తీరాల్సిందే. ప్రస్తుతం అనిరుధ్ ట్వీట్ వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు