Manisha Krystina
ఎంటర్‌టైన్మెంట్

Manisha Krystina: 2 వేల మంది అప్రోచ్ అయితే.. 500 మంది కమిట్‌మెంట్ అడిగారు!

Manisha Krystina: యాక్టర్, ఆర్టిస్ట్, డ్యాన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన తెలుగు అమ్మాయ్ మనీషా క్రిష్టినా తన తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఆమె ఇందులో వివరించారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా, యాడ్స్, ర్యాంప్ వాక్ షోస్ వంటి వాటిలో కూడా కమిట్‌మెంట్ (commitment demands) అడుగుతారని మనీషా చెప్పిన మ్యాటర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె కొత్తగా చెప్పిందేం లేదు కానీ, ఇలా ధైర్యంగా చెప్పిన లేడీగా ఆమెను అంతా కొనియాడుతున్నారు. మనీషా క్రిష్టినా తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Also Read- Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా‌ ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!

‘‘రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ చేయమని అడుగుతున్నారు. కానీ నేను అవి చేయకూడదని అనుకున్నాను. అందుకే చాలా ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నాను. ఒక్క తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళ ప్రాజెక్ట్స్ కూడా వదిలేసుకున్నా. నేను చేయగలనని అనుకున్నా, సెట్‌లో చేయలేకపోతే ఎలానో ఉంటుంది. అందుకే నేను ఏది చేయగలనో.. అదే సెలక్ట్ చేసుకుంటాను. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్స్ విధానం హై రేంజ్‌లో ఉంటుంది. అంతెందుకు.. దాదాపు నన్ను 2 వేల మంది అప్రోచ్ అయితే.. అందులో 500 మంది నన్ను కమిట్‌మెంట్ అడిగిన వాళ్లున్నారు. ఇది నేను లెక్క పెట్టుకుని ఏం చెప్పడం లేదు.. రఫ్‌గా చెబుతున్నానంతే. ఓన్లీ మూవీస్ అనే కాదు, ఒక చిన్న పాత్ర చేయడానికైనా, లేదంటే పెద్ద యాడ్స్‌కైనా, ర్యాంప్ వాక్ షోలకైనా.. అలాంటి వాటిలో చేయడానికి కూడా కమిట్‌మెంట్స్ అడిగేవారు. నిజంగా నేను కమిట్‌మెంట్స్ ఇచ్చి ఉంటే.. పెద్ద హీరోయిన్‌ని అయ్యేదాన్ని అని చెప్పలేను కానీ, బాగా తెలిసిన స్టార్ నటిని మాత్రం అయ్యేదాన్ని.

Also Read- Naga Chaitanya: సమంత, శోభితలతో నాగ చైతన్య రొమాన్స్? బయటపడ్డ టాప్ సీక్రెట్?

నా జర్నీ మొదలై దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అయినా ఎటువంటి గుర్తింపు రాలేదు. నేను వచ్చిన రెండు మూడు సంవత్సరాల తర్వాత కమిట్‌మెంట్ ఇచ్చినా.. ఇప్పుడు మంచి పొజిషన్‌ అయితే ఖచ్చితంగా వచ్చేది. కెరీర్ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల వరకు ఇలాంటివి నేను ఫేస్ చేయలేదు కానీ, ఆ తర్వాత చాలా ఫేస్ చేశాను. నిజంగా ఇండస్ట్రీలోకి లేడీస్ వస్తుంటే కుటుంబ సభ్యులు ఎందుకు బాధపడతారో నాకు అప్పుడు అర్థమైంది. కాకపోతే నేను అలాంటి వాటిని ఎలా డీల్ చేయాలో కూడా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్స్‌ని డైరెక్ట్‌గానే అడుగుతారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేముందు.. నిర్మాతతో కానీ, దర్శకుడితో కానీ కమిట్‌మెంట్స్ ఉంటాయి మేడమ్.. అందుకు ఓకేనా? అని అడుగుతారు. నేను వెంటనే నో అని చెప్పేస్తాను. ఏవైనా క్లీన్ ప్రాజెక్ట్స్ ఉంటేనే నా దగ్గరకు తీసుకురండి అని ముఖం మీదే చెప్పేస్తా..’’ అంటూ మనీషా క్రిష్టినా అసలు విషయం రివీల్ చేసింది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?