Ranga Reddy District( image credit: swetcha reporter)
తెలంగాణ

Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

Ranga Reddy District: ఉమ్మడి (Ranga Reddy) రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను టౌన్ ప్లానింగ్ (Town Planning) అధికారుల కొరత వేధిస్తున్నది. మున్సిపాలిటీలలో ప్రాధాన్యత గల టౌన్ ప్లానింగ్ (Town Planning) పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక టౌన్ ప్లానింగ్ అధికారి రెండు మూడు మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉమ్మడి రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలో ఉన్న 38 మున్సిపాలిటీలకు సరిపడా టౌన్ ప్లానింగ్ (Town Planning) అధికారులు(టీపీఓ) లేరు. పాత మున్సిపాలిటీలకే పూర్తి స్థాయిలో లేరు. కొంతకాలం క్రితం ఉమ్మడి జిల్లాలో కొత్త మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. పాత మున్సిపాలిటీలకే టౌన్ ప్లానింగ్ అధికారులను సర్దుబాటు చేయలేక సతమతమవుతున్న అధికారులకు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు టీపీఓలను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అక్రమాలు ఆపే వారెవరు?

మున్సిపాలిటీలలో కమిషనర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత గల పోస్టు టౌన్ ప్లానింగ్ (Town Planning) అధికారి. అభివృద్ధికి సంబంధించి అనేక విధులను నిర్వహిస్తుంటారు. పట్టణ ప్రణాళిక రూపకల్పన, అనుమతుల జారీ, అక్రమ కట్టడాల కట్టడి అంతా టీపీవోల పర్యవేక్షణలోనే ఉంటుంది. ఇంత ప్రాధాన్యత గల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఒక్కొక్క టీపీఓకు రెండు నుంచి మూడు మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీనివల్ల ఏ మున్సిపాలిటీకి సరైన న్యాయం చేయలేక పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ కట్టడాల విషయంలో ఫెయిల్ అవుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడం వల్ల మున్సిపాలిటీలలో పాలన సైతం అస్తవ్యస్తంగా తయారైంది.

 Also Read: GHMC and HMDA: గ్రేటర్‌లో 24 లక్షల.. మొక్కలు నాటడమే లక్ష్యం!

మేడ్చల్ జిల్లాలో మరీ దారుణం

మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలకు టౌన్ ప్లానింగ్ (Town Planning) అధికారుల కొరత తీవ్రంగా ఉంది. గుండ్లపోచంపల్లి, మేడ్చల్,(Medchal)  తూముకుంట మున్సిపాలిటీలకు రెగ్యులర్ టీపీఓలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుండిగల్‌కు సంబంధించిన టీపీఓ గుండ్ల పోచంపల్లికి ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. మూడు రోజులు దుండిగల్ మరో మూడు రోజులు గుండ్ల పోచంపల్లి(Pocham Pally)  చూసుకోవాల్సి వస్తున్నది. రెగ్యులర్ టీపీఓలు లేకపోవడం వల్ల బిల్ కలెక్టర్లకు ఆ బాధ్యతలను అప్పగించి మమ అనిపిస్తున్నారు. టీపీఓతోనే పని ఉంటే మాత్రం అతను వచ్చేవరకు ఆగాల్సిందే. మేజర్ మున్సిపాలిటీ అయినా మేడ్చల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న టీపీఓ రాధాకృష్ణకు మూడు మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగించారు. దీనివల్ల ఏ మున్సిపాలిటీకి న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మూడు మున్సిపాలిటీల బాధ్యతలను నిర్వహించడం వల్ల ప్రజలకు టౌన్ ప్లానింగ్ అధికారి అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

కొత్త మున్సిపాలిటీలదీ అదే పరిస్థితి

మేడ్చల్ జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలకు సైతం టీపీఓల కొరత ఏర్పడింది. జిల్లాలో ఇటీవల ఎల్లంపేటతో పాటు అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ మూడు మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్ టీపీఓలే దిక్కయ్యారు. పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా పట్టణ ప్రణాళిక రూపకల్పనకైనా రెగ్యులర్ టౌన్ ప్లాన్ అధికారి ఉంటేనే న్యాయం జరుగుతుందని, వారిని వెంటనే నియమించాలని ప్రజానీకం కోరుతున్నది.

 Also Read: Gurram Malsur Appointed: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సీపీఆర్వో ఎంపిక!

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్