Local Body Elections: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగబోతున్న అతిపెద్ద వార్ లోకల్ బాడీ ఎన్నికలు.( Local Body Elections) ఇందులో సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలూ ఉవ్విళ్లూరుతున్నాయి. వరుస ఓటములకు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విజయ పరంపరను కొనసాగించాలని కాంగ్రెస్ చూస్తున్నది. అటు పెరిగిన ఓట్ షేర్‌తో సత్తా చాటాలని బీజేపీ ఆశల్లో ఉన్నది. మూడు పార్టీలు స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న వేళ మంత్రి సీతక్క (Seethakka) కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కీలక వ్యాఖ్యలు.. కానీ..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) వెల్లడించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా హాజరైన ఆమె, స్థానిక సంస్థల నోటిఫికేషన్‌పై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ కంటే ముందే రైతులకు భరోసాను అందిస్తామని పేర్కొన్నారు.
జూలై చివరి నాటికి ఎన్నికలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వారంలోనే నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం కొత్త వివాదానికి దారి తీసింది. దీంతో నోటిఫికేషన్ ఇప్పుడే కాదంటూ సీతక్క మాట మార్చారు. వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుందని మాత్రమే చెప్పానని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని వివరణ ఇచ్చారు.
Also Read: GHMC Engineers: బీనామీలతో పనులు దక్కించుకుంటున్న.. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు!
గతేడాదే ముగిసిన గడువు
గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగిశాయి. ఏడాదిన్నరగా ఎన్నికలు జరగలేదు. దానివల్ల కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 వందల కోట్ల దాకా ఆగిపోయాయి. ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పడితేనే ఆ నిధులు వస్తాయి. ఇటు మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల గడువు కూడా గతేడాది జులైలో, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల గడువు ఏప్రిల్‌లో ముగిసింది. ఎన్నికల కోసం అందరూ ఎదురుచూస్తున్న వేళ మంత్రి చేసిన వ్యాఖ్యలు కొత్త కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేశాయి.
ఈ మధ్య పదేపదే అదే మాట
కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య ఏ కార్యక్రమానికి వెళ్లినా పదేపదే లోకల్ బాడీ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే వారికి హింట్ ఇచ్చినట్టుగా, జులైలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా ఎక్కడ చూసినా సిద్ధకండి అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు అదే మాటను వినిపిస్తున్నారు. ఈ మధ్య మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,( Thummla Nageswar Rao) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తాము పాల్గొంటున్న కార్యక్రమాల్లో రాబోయే స్థానిక ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సత్తా చాటాలని పిలుపునిస్తున్నారు. అయితే, ఎన్నికలపై పై స్థాయిలో సస్పెన్స్ కొనసాగుతున్నవేళ మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముందు ఉంటాయని, తర్వాత కాదని ఆమె చేసిన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో అసలు విషయం ఏంటనేది తేలిపోతుంది.
Also Read: Allegations Of Officials Misusing: అద్దె వాహనాల పేరుతో బిల్లులు.. తిరగకున్నా తిరిగినట్లు రికార్డ్!