Aicc Meenakshi natrajan: పనిచేసిన వాళ్లకు పదవులు తప్పక వస్తాయి.
Aicc Meenakshi natrajan (imagecredit:twitter)
Telangana News

Aicc Meenakshi natrajan: పనిచేసిన వాళ్లకు పదవులు తప్పక వస్తాయి.. మీనాక్షి నటరాజన్

Aicc Meenakshi natrajan: పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. ఆమె పార్టీ బలోపేతంపై టీపీసీసీ అబ్జర్వర్లు, డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. పార్టీ , ప్రభుత్వంలోను పదవుల పంపిణీ సామాజిక న్యాయ పరంగా జరుగుతున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోమేచన మేరకు సమాజంలో ఎవరి వాటా వారికే”అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామన్నారు.

జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్

ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామని, ఇకపై కూడా పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపునిస్తూ ముందుకు తీసుకెళ్లబడుతుందన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ “జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకన్నా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత మనదేనని పేర్కొన్నారు.

Also Read: Bail to Kommineni: కొమ్మినేనికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికలు

ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం మనందరికి గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం గణనీయంగా పురోగమిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు, కో-ఆర్డినేటర్లు నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. మండల, జిల్లా స్థాయిల కమిటీల నిర్మాణం సకాలంలో పూర్తిచేయాల్సిన అవసరం ఉందని, త్వరలో నిర్వహించవలసిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు.

Also Read: Air India flight: మరో ఎయిర్ఇండియా విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్.. చివరికి!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..