Wild Breath First Look Launch
ఎంటర్‌టైన్మెంట్

Wild Breath: కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు.. డైలాగ్ మారింది బ్రో!

Wild Breath: కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలనేది ఇప్పటి వరకు ఉన్న డైలాగ్. ఈ డైలాగ్‌ని నటుడు శివాజీ రాజా (Shivaji Raja) కాస్త మార్చి చెప్పారు. స్టార్స్ అవసరం లేదు.. కంటెంట్ ఉంటే చాలని అంటున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, స్టార్ హీరోలే ఉండాల్సిన అవసరం లేదని అన్నారు శివాజీ రాజా. ‘రేవు’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించిన సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘వైల్డ్ బ్రీత్’ రాబోతోంది. శుక్రవారం యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. హరినాథ్ పులి దర్శకత్వంలో డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు.

Also Read- Natti Kumar: పెద్దలకే సీఎంతో సమావేశం.. మళ్లీ అదే తప్పు!

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులంతా ఈ వేడుకలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి వారితో స్నేహం ఉంది. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు నిర్మాతగా వైల్డ్ బ్రీత్ సినిమా చేస్తుండటం చాలా హ్యాపీ. ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలెన్నో విజయాలు సాధిస్తున్నాయి. ‘వైల్డ్ బ్రీత్’ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిర్మాతగా ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు హరినాథ్ పులి దర్శకుడిగా మంచి మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. ఇవాళ సినిమా హిట్ అవడానికి స్టార్స్ అవసరం లేదు. స్టార్స్ వెంట పడటం కాదు.. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Sanjay Kapur: కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి.. కారణం తెలిస్తే షాకవుతారు

నిర్మాత పర్వతనేని రాంబాబు (Parvathaneni Rambabu) మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నాకు అన్నివిధాలుగా సహకరిస్తున్న మా నిర్మాత మురళి గింజుపల్లి.. నన్ను నమ్మి అంతా నాకు అప్పగించారు. అంతే నమ్మకంగా ఆయనకు మంచి పేరు వచ్చేలా సినిమాలు నిర్మిస్తాను. నిన్న ఏపీ సీఎం చంద్రబాబుని కలిశాను. ఆయనకు మా ‘వైల్డ్ బ్రీత్’ మూవీ గురించి చెప్పాను. త్వరలోనే అపాయింట్‌మెంట్ ఇచ్చి పిలుస్తానని అన్నారు. నా పుట్టినరోజు అని తెలిసి అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌డే అని చెప్పారు. ఆయన అలా చెప్పడం.. చాలా హ్యాపీగా అనిపించింది. శివాజీ రాజా అన్నని పిలవగానే మా కార్యక్రమానికి వచ్చారు. ఆయనకు థ్యాంక్స్. ఇంకా వచ్చిన ఇతర అతిథులందరికీ మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘వైల్డ్ బ్రీత్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. హరినాథ్ పులి దర్శకుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకుంటాడని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హాజరైన అతిథులంతా మాట్లాడారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?