Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి నలుగురు హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న లిస్ట్ లో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి మొదలయ్యి.. నాగార్జున తన ఫామ్ ను కొనసాగిస్తూ.. ఆ తర్వాత నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. నాగ్, చైతన్య పర్లేదు.. అఖిల్ కు మాత్రం స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయ్య గారికి ఒక్క సరైన హిట్ పడితే ఆ కిక్కే వేరు. ఇక ఇటీవలే నాగచైతన్య తండేల్ మూవీతో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. సినీ కెరియర్ పరంగా చైతూకు కలిసి వచ్చినా.. తన వ్యక్తిగత జీవితంలో చాలా సఫర్ అయ్యాడు. ఎప్పుడూ వెనుకడుగు వేసింది లేదు. అవన్నీ తట్టుకుని ముందుకు వెళ్తున్నాడు.
Also Read: Ahmedabad plane crash: ఘోర విమాన ప్రమాదం.. బతికి బయట పడిన చిరంజీవి, సుస్మిత.. నాగబాబు సంచలన పోస్ట్
ఏం జరిగిందంటే?
ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంతకు విడాకులు ఇచ్చి, బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ శోభితను, నాగ చైతన్య ను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఆమె మన తెలుగు కంటే.. బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే , నాగ చైతన్య- సమంత- శోభిత ఈ ముగ్గురికీ సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Also Read: Air India Flight Crashed: కుప్పకూలిన విమానం.. ఫ్లైట్‌లో మాజీ సీఎం.. 100 మందికి పైగా మృతి?
ఆ మూవీలో ముగ్గురు రొమాన్స్ చేసే ఛాన్స్?
ఇన్ని రోజుల తర్వాత ఈ న్యూస్ ఎందుకు బయటకొచ్చిందో తెలియదు. కానీ, జనాలు మాత్రం ఇది నిజమేనా అని అనుకుంటున్నారు. నాగ చైతన్య, సమంత, శోభిత కలిసి ఓ మూవీ చేసే అవకాశం వస్తే.. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసినట్టు తెలిసిన సమాచారం. ఆ మూవీ ఏదో కాదు.. నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘మజిలీ’. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో దివ్యాంక కౌశిక్ చేసిన పాత్ర కోసం ముందుగా శోభిత దూళిపాళ్లను ఎంపిక చేశారని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
Also Read: Rahul Gandhi Letter: విద్యార్థులకు అండగ రాహుల్.. ప్రధానికి బహిరంగ లేఖ.. వైఫల్యాలపై నిలదీత!