Bail to Kommineni: కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Bail to Kommineni (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Bail to Kommineni: కొమ్మినేనికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Bail to Kommineni: ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ మేరకు ధర్మాసనం.. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేవద్దని కొమ్మినేనిని హెచ్చరించింది. భవిష్యత్తుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

నవ్వితే అరెస్ట్ చేస్తారా?
ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ (Kommineni Arresrt) అక్రమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పీకే మిశ్రా (Justice PK Mishra), జస్టిస్ మన్మోహన్ (Justice Manmohan)లతో కూడిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టీవీ డిబేట్ లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగైతే కేసుల విచారణ సమయంలో కొన్ని సందర్భాల్లో తామూ నవ్వుతుంటామని న్యాయమూర్తి అన్నట్లు తెలుస్తోంది. వాక్ స్వాతంత్రంలో భాగంగా కొమ్మినేనిని విడుదల చేయాలని ధర్మాసనం సూచించింది. అయితే అవసరమైన షరతులు విధించేందుకు కింది కోర్టుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Also Read: Raja Raghuvanshi Case: హనీమూన్ కేసులో భారీ ట్విస్ట్.. భర్తతో పాటు మరో స్త్రీ హత్యకు కుట్ర!

అసలేం జరిగిందంటే?
ఓ ప్రముఖ మీడియా ఛానెల్ లో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ నిర్వహించారు. అందులో పాల్గొన్న జర్నలిస్టు కృష్ణంరాజు (Journalist Krishnam Raju) అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఘాటు పదజాలాన్ని ఉపయోగించారు. దీనిపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత మహిళలు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. కొమ్మినేనితోపాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని నివాసానికి వెళ్లి ఆయన్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read This: Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఇక కష్టమే!

Just In

01

Bandi Sanjay: యువతకు అందుబాటులో ఉంటానన్న హామీ ఏమాయే? బండి సంజయ్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి కేసులో నేడు చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న ఎన్‌ఐఏ

Akhanda2: పూనకాలు తెప్పిస్తున్న బాలయ్య బాబు ‘అఖండ 2: తాండవం’.. ఇది చూస్తే షాక్ అవుతారు..

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు