Ponnam Prabhakar(image credit: twitter)
తెలంగాణ

Ponnam Prabhakar: గురుకులాలపై దృష్టి సారించాలి!

Ponnam Prabhakar: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాలపై ప్రిన్సిపాల్స్, వార్డెన్స్ ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. “విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలి” అని మంత్రి అన్నారు.

 Also ReadKodandareddy: సెరికల్చర్ సమస్యల పరిష్కారానికి కృషి!

ప్రతి ఒక్కరూ పని చేయాలి

పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాల విద్యను అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో, విద్యాబోధనలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్రం, దేశం గర్వపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల అద్దె బకాయిలు విడుదల చేసిందని గుర్తుచేసిన మంత్రి, భవనాల యజమానులతో సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పాఠశాలలు, హాస్టల్‌లలో పరిశుభ్రత పాటించాలని, దోమల నుంచి రక్షణ కోసం నెట్ ఏర్పాటు చేయాలన్నారు.

పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలి

విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, వసతి సామగ్రిని వెంటనే అందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి అధికారులు నెలవారీ రిపోర్టులు తెప్పించుకోవాలని, ఎటువంటి ప్రయత్న లోపాలు లేకుండా విద్యార్థులకు విద్య, ఇతర సౌకర్యాలు అందించాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఎంజేపీ సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీలు తిరుపతి, మద్దిలేటి, ఎంబీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో అలౌక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జేడీ ఇందిర తదితర ఉన్నతాధికారులు, ఆర్‌సీఓలు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

 Also Read: HYDRA Commissioner: వరద ముంపు ప్రాంతాల్లో.. హైడ్రా కమిషనర్ పర్యటన!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?