Schools Reopen( iamge credit: twitter)
తెలంగాణ

Schools Reopen: నూత‌నోత్సాహంతో పాఠ‌శాల‌ల పున:ప్రారంభం!

Schools Reopen: తెలంగాణలో నూత‌నోత్సాహంతో పాఠ‌శాల‌ల పున:ప్రారంభమయ్యాయి. కాగా,  తొలిరోజు 8,33,398 మంది విద్యార్థుల‌ పాఠశాలలకు హాజరయ్యారు. పాఠ‌శాల‌లు తెరిచిన రోజే పుస్తకాలు, యూనిఫాంలు విద్యార్థుల‌కు అంద‌జేయాల‌నే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం పాఠ‌శాల‌లు తెరిచే నాటికి పాఠ‌శాల‌ల‌కు పుస్తకాలు, యూనిఫాంలు చేరేలా జాగ్రత్తలు తీసుకోవ‌డంతో ఆ ల‌క్ష్యం నెర‌వేరింది. పాఠ‌శాల‌లు తెరిచే నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,852 ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకుల పాఠ‌శాల‌లకు 1,01,66,220 పుస్తకాలు చేరాయి.

 Also Read: IAS Officers: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్.. స్నేహ శబరీశ్ బదిలీ!

విద్యార్థుల‌కు యూనిఫాంలు అంద‌జేత

ఇందులో తొలిరోజు పాఠశాల‌ల‌కు హాజ‌రైన సుమారు 8,33,398 ల‌క్షల మంది విద్యార్థుల‌కు 54,52,708 పుస్తకాల‌ను ఉపాధ్యాయులు అందజేశారు. ఈ ఏడాది మొత్తం 20,30,667 మంది విద్యార్థుల‌కు యూనిఫాంలు అంద‌జేయాల‌ని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తొలిరోజు పాఠశాల‌ల‌కు హాజ‌రైన 8,33,398 విద్యార్థుల‌కు ఒక జ‌త యూనిఫాంల‌ను ఉపాధ్యాయులు అంద‌జేశారు. రెండో జ‌త‌ను సాధ్యమైనంత త్వర‌లో అంద‌జేయనున్నారు.

పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ,

ఈ ఏడాది నుంచి పాఠ‌శాల స్థాయిలోనే విద్యార్థుల‌కు కృత్రిమ మేధ(ఏఐ)ను ఒక స‌బ్జెక్ట్‌గా బోధిస్తుండ‌డంతో ఆ స‌బ్జెక్టుకు సంబంధించిన పుస్తకాల‌ను విద్యార్థుల‌కు అంద‌జేయ‌నున్నారు. గ‌తేడాది స‌మారు 11 వేల మంది ఉపాధ్యాయుల‌ను నియ‌మించ‌డం, 21,419 మందికి ప్రమోష‌న్లు ఇవ్వడం, 34,700 మందికి బ‌దిలీలు పూర్తి చేయ‌డంతో ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల న‌మోదు, బోధ‌న‌పై నూత‌నోత్సాహంతో దృష్టిసారించారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీల నేతృత్వంలోనే గ‌తేడాదే అన్ని పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్పనను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదిలా ఉండగా పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఇత‌ర కార్యక‌లాపాల‌పై విద్యా శాఖ ఉన్నతాధికారులు రోజువారీ స‌మీక్ష చేయాల‌ని నిర్ణయించారు.

 Also Read: Teacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ‘పరీక్ష’ తప్పట్లేదు.. ఈనెల 18 నుంచి 30వరకు ఎగ్జామ్స్!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..