Naveen Mittal( image credit: twitter)
తెలంగాణ

IAS Transfers: భారీగా ఐఏఎస్ ట్రాన్స్‌ఫర్స్.. పలు జిల్లాలకు ఛేంజ్!

IAS Transfers: సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి సర్కార్ తప్పించింది. నిత్యం ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కొత్తగా ఆయనకు విద్యుత్ శాఖను అప్పగించారు. గురువారం రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ శంశాంక్ గోయల్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. ఎన్. శ్రీధర్‌కు పంచాయతీ రాజ్, రోడ్లు డెవలప్‌మెంట్ శాఖకు కేటాయించగా, మైన్స్ అండ్ జియోలజీ శాఖకు అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

  Also Read: Minister Konda Surekha: చెంగిచెర్లలో ఆక్రమణకు.. గురైన భూమి ఆకస్మిక తనిఖీ!

హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన

ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ‌గా డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను నియమించారు. దీంతో పాటు ఆయన ప్లానింగ్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. కొత్తగా రెవెన్యూ శాఖను లోకేష్​ కుమార్‌కు అప్పగించారు. ఇంత కాలం ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేసిన గౌరవ్ ఉప్పల్‌కు గవర్నమెంట్ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇచ్చారు. బీ భారతి లక్‌పత్ నాయక్‌కు టీజీ ఇన్ఫర్మేషన్ కమిషన్, హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన, రీజనల్ రింగ్ రోడ్డు, ల్యాండ్ ఆక్యూపేషన్ కమిషనర్‌గా శివకుమార్ నాయుడు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్ హనుమంతు, నిజామాబాద్ కలెక్టర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సీనియర్ సిటీజన్స్ డైరెక్టర్‌గా శ్రీజన, అగ్రికల్చర్, కో ఆపరేషన్ జాయింట్ సెక్రటరీగా శివ శంకర్, జీఏడీ జాయింట్ సెక్రెటరీగా చిట్టెం లక్ష్మి, సిద్ధిపేట కలెక్టర్‌గా కె. హైమావతి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా వాసం వెంకటేశ్వరరెడ్డిలను కేటాయించారు.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నవీన్ నికోలస్

హౌసింగ్ సెక్రెటరీగా గౌతమ్, సింగరేణి కాలరీస్ డైరెక్టర్‌గా గౌతమ్ పోట్రు, ఫిషరీస్ డైరెక్టర్‌గా కె. నిఖిల, టూరిజం ఎండీ‌గా వల్లూరి క్రాంతి, ఆరోగ్య శ్రీ సీఈవోగా పీ. ఉదయ్ కుమార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రెటరీగా ప్రియాంక అలా, సంగారెడ్డి కలెక్టర్‌గా పి. ప్రవిణ్యా, హ్యూమన్ రైట్స్ సీఈవోగా నిర్మల కాంతి వెస్లీ, మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా మనుచౌదరి, సివిల్ సప్లై డైరెక్టర్‌గా ముజమ్మిల్ ఖాన్, హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్​, ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నవీన్ నికోలస్, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా చెక్క ప్రియాంక, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చహత్ బజ్ పాల్, అశ్విని తనాజీ వాకాడేకు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్‌గా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా ప్రపుల్ దేశాయ్, షఫియుల్లా‌కు మైనార్టీ వెల్ఫేర్ సెక్రెటరీ, ఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌కు హెచ్‌ఎండీఏ డైరెక్టర్, ఇండస్ట్రీ, డైరెక్టర్‌గా నిఖిలా చక్రవర్తికి ఇచ్చారు. దీంతో పాటు శంకరయ్యకు టీజీ అయిల్ ఫెడ్, శ్రీకాంత్ బాబుకు ఆయుష్​ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. టీజీఐఐసీ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్‌గా పవన్ కుమార్‌కు ఇచ్చారు. ఇక సీఎం సీపీఆర్వోగా జీ మల్సూర్‌ను కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకున్నట్లు సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 Also Read: Teacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ‘పరీక్ష’ తప్పట్లేదు.. ఈనెల 18 నుంచి 30వరకు ఎగ్జామ్స్!

Just In

01

OTT Movie: ఐరిష్ హిస్టరీ డార్క్ సైడ్‌ ఎలా ఉందంటే?.. మరీ ఇంత వైలెంటా..

Mahesh Kumar Goud: అక్టోబరులో డీసీసీ నియామకాలను పూర్తి: మహేష్ కుమార్ గౌడ్

TGSRTC: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంజీబీఎస్‌లో రాకపోకలు బంద్.. ఆర్టీసీ కీలక ప్రకటన

TG Medical Council: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. ఆ డాక్టర్లపై వేటు..?

KTR: మెట్రోకు ఎంత నష్టం? భూములు అమ్ముతారా?.. కేటీఆర్ ఫైర్!