Gopichand in New Film
ఎంటర్‌టైన్మెంట్

Gopichand33: యోధుడిగా గోపీచంద్.. ఫస్ట్ లుక్ అదుర్స్..

Gopichand33: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుంది. మంచి మంచి కథలు, కాన్సెప్ట్‌లతో టాలీవుడ్ మేకర్స్.. ఇండస్ట్రీ ప్రతిష్టను పెంచుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రతి సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ వైపే చూస్తుందనడంలో అసలు అతిశయోక్తి లేనే లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటున్న చాలా వరకు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. మంచి కథని దేశ మొత్తానికి తెలియజేయడానికి మేకర్స్ చేస్తున్న కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టినా, కొన్ని మాత్రం సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్ ప్రతిష్టను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో మంచి కాన్సెప్ట్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు మాచో స్టార్ గోపీచంద్ (Macho Star Gopichand). ప్రస్తుతం ఆయన తన 33వ చిత్రంలో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఓ హిస్టారికల్ ఎపిక్‌‌గా రూపుదిద్దుకుంటోంది. (HBD Gopichand)

Also Read- Plane Crash: విమాన ప్రమాదం బాధాకరం.. టాలీవుడ్ నటుల స్పందనిదే!

ఆ విషయం తాజాగా విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు (జూన్ 12)ను పురస్కరించుకుని, మేకర్స్ ఈ సినిమా నుంచి పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో గోపీచంద్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక యోధుడిగా గోపీచంద్ ఇందులో కనిపిస్తున్నారు. దీనికోసం ఆయన అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. పొడవాటి జుట్టు, యుద్ధగాయాలు, నుదిటిపై వీర తిలకంతో కనిపించిన ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తోంది. చేతిలో ఖడ్గంతో యుద్ధరంగం ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ గోపీచంద్ శక్తి, శౌర్యాన్ని తెలియజేస్తోంది. ఇంకా చెప్పాలంటే విక్రమార్క బేతాళ కథల్లో.. విక్రమార్కుడిని గోపీచంద్ తలపిస్తుండటం విశేషం.

Also Read- Trivikram Srinivas: ట్విస్ట్ అదిరింది.. అల్లు అర్జున్, రామ్ చరణ్ అవుట్.. ఎన్టీఆర్‌ ఫిక్స్!

గ్లింప్స్ విషయానికి వస్తే.. మంచుతో కప్పబడిన పర్వత శ్రేణుల నడుమ గ్లింప్స్ ప్రారంభమైంది. ఓ యోధుడు తన టెంట్ నుంచి బయటకు వచ్చి, తాను ప్రేమగా పెంచిన గుర్రంతో మమేకమయ్యే విజువల్‌ని ఇందులో చూపించారు. తన తలను గుర్రం తలపై ఆనించి, మౌనంగా ఓ వాగ్దానాన్ని చేస్తాడు. దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ‘ధీర ధీర’ సంగీతం మ్యాజికల్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ విజువల్స్ మనసును తాకుతూనే పవర్‌ఫుల్‌గా, టాలీవుడ్ నుంచి మరో అద్భుతమైన సినిమా రాబోతున్న ఫీల్‌ని ఇస్తున్నాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాలో భారతదేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని అద్భుతంగా మలిచారు. 7వ శతాబ్దం నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, మరిచిపోయిన అధ్యాయానికి మళ్లీ జీవం పోయబోతున్నాడు. అతను ఇంతకు ముందు సినిమాలు IB 71 (ఆకాశంలో), ఘాజి (నీటిలో), అంతరిక్షం (అంతరిక్షంలో) వంటి విభిన్న కథనాలతో, సాంకేతిక నైపుణ్యంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడీ చిత్రంతో మరో డిఫరెంట్ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రూపొందించిన సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?