Pakistan Water Crisis: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత దయాది దేశం పాకిస్థాన్ ను భారత్ చావు దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తో తొలుత ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం (India.. ఆ తర్వాత పాక్ చేసిన కవ్వింపులతో ఆ దేశంలోని ఎయిర్ బేస్ ను నాశనం చేశారు. అయితే దాని కంటే ముందే సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకొని పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది. ఈ చర్యతో పాక్ ఎడారిగా మారడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలు చూస్తే ఇదే నిజమైనట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ లో దయాదీ దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
డ్యామ్స్ కు తగ్గిన నీటి ఫ్లో..
పాకిస్థాన్ తన నీటి అవసరాల కోసం దశాబ్దాల కాలంగా మంగ్లా (Mangla Dam), టర్బెలా డ్యామ్స్ (Tarbela Dam) పై ఆధారపడుతూ వస్తోంది. మంగ్లా డ్యామ్ జీలం (Jeelan River) నదిపై నిర్మించగా.. టర్బెలా డ్యామ్ ను సింధూ నదిపై ఏర్పాటు చేశారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో చేసుకున్న నీటి ఒప్పందాన్ని భారత్ విరమించుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాక్ కు వెళ్లే సింధు నది జలాలు (Indus Water Flow) గణనీయంగా తగ్గిపోయాయి. అయితే పాక్ కు ఎంతో కీలకమైన మంగ్లా, టర్బెలా డ్యామ్స్ ఈ సింధూ జలాలపైనే ఆధారపడ్డాయి. తాగు, సాగు నీటికోసం పాక్ ఈ డ్యామ్ నుంచే నీటిని దిగువకు విడుదల చేస్తోంది. కానీ నదీ జలాల ఒప్పందం రద్దు కారణంగా ఆ రెండు డ్యామ్స్ కు సింధు నది జలాల ఫ్లో గణనీయంగా తగ్గింది. దీనికి తోడు జమ్ము కశ్మీర్ లో సింధు జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలన్న భారత్ నిర్ణయంతో పాక్ లోని కీలకమైన డ్యామ్స్ పై పెను ప్రభావం పడే అవకాశముంది.
ఇష్టారీతిన దిగువకు నీరు విడుదల
మరోవైపు దయాది దేశం పాకిస్థాన్ నీటి విషయంలో అనాలోచితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ ఫ్లోకు మించి ఔట్ ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ (IRSA) ప్రకారం బుధవారం దేశంలోకి వచ్చే ఇన్ ఫ్లో కంటే 11,180 క్యూసెక్కులు ఎక్కువ నీటిని పాక్ దిగువకు విడుదల చేసింది. పాక్ లోని మెుత్తం డ్యామ్ లకు వస్తున్న సమిష్టి ఇన్ ఫ్లో 2,41,611 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 2,52,791 క్యూసెక్కులుగా ఉంది. దీని వల్ల నదీ ప్రవాహంపై పూర్తిగా ఆధారపడే పంజాబ్, సింధ్ ప్రావిన్స్ రానున్న రోజుల్లో నీరు లేక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది.
Also Read: Air India Plane Crash: విమానం ప్రమాదంపై వెలుగులోకి సంచలన నిజాలు
పంటలపై పెను ప్రభావం
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రజలకు వ్యవసాయే జీవనాధారం. ప్రస్తుతం అక్కడ ఖరీఫ్ సీజన్ నడుస్తోంది. బుధవారం పంజాబ్ ప్రావిన్స్ కు 1,14,600 క్యూసెక్కుల నీరు రాగా అది గతేడాది వచ్చిన నీటితో పోలిస్తే 20% మేర తగ్గిందని సమాచారం. ఇది పంటలపై పెను ప్రభావం చూపే అవకాశముందని అక్కడి ప్రజలు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత IRSA సలహా కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. ఖరీఫ్ ప్రారంభ సీజన్ (మే 1-జూన్ 10) లో గతంతో పోలిస్తే 21 శాతం మేర నీటి కొరత ఉండొచ్చని అంచనా వేసింది. భారత్ నుంచి నీటి సరఫరా తక్కువగా ఉన్నందను మరాలా వద్ద చీనాబ్ ఇన్ ఫ్లోలు భారీగా తగ్గిందని పేర్కొంది. ఖరీఫ్ సీజన్ చివరిలో (జూన్ 11-సెప్టెంబర్ 30) నీటి కొరత 7% ఉండొచ్చని అంచనా వేసింది.