Ponguleti Srinivas Reddy( iamage credit: swetcha reporter)
తెలంగాణ

Ponguleti Srinivas Reddy: కాళేశ్వరంప్రాజెక్ట్.. ధరణి మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కాం!

Ponguleti Srinivas Reddy: కాలేశ్వరం ప్రాజెక్టు, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ లని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరులతో రెవిన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎంతటి వారినైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చాక సంబంధిత వ్యక్తులపై ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదోళ్ల సొమ్ము తిన్న వారు ఎవరైనా సహించేది లేదని తెగేసి చెప్పారు.
కాలేశ్వరం కమిషన్ విచారణలో రాజకీయ వేధింపులు లేవన్నారు.

 Also Read: Coronavirus Cases India: దేశంలో కరోనా ప్రకంపనలు.. 24 గంటల్లో భారీగా కేసులు.. ఎంతంటే?

మిషన్ భగీరథ లోనూ గత ప్రభుత్వ నాయకులు దోచుకున్నారని వెల్లడించారు. ఒకదాని తర్వాత మరొక దానిపై విచారణ ఉంటుందని వివరించారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్నారు.. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఫోన్ టాపింగ్ అసలు నిందితుడు విచారణకు హాజరయ్యారని చెప్పారు. ఈ కేసులో కూడా సూత్రధారులు బయటకు వస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన స్కామ్లలో వ్యక్తులనైనా, వ్యవస్థనైనా అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

వీటన్నిటిపై ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ వచ్చిందని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా పేదోడి సొమ్ము తింటే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కక్షపూరితంగా కాకుండా చట్టపరంగా వ్యవహరిస్తామన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో అడ్డగోలుగా 8.19 లక్షల కోట్ల అప్పులు చేసినా ఇందిరమ్మ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి వెల్లడించారు.

Also Read: New Ministers Portfolios: కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ