AA Arts Mahendra: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎ. ఎ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర మృతి చెందారు. గత కొంతకాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు సంతాపం
తెలుపుతున్నారు.
టాలీవుడ్లో మరో విషాదం
ఎ. ఎ. ఆర్ట్స్ అధినేత మహేంద్ర (79) బుధవారం రాత్రి 9.30 గంటలకు మృతి చెందారు. గత కొంతకాలంగా గుండెకి సంబందించిన సమస్యలతో మహేంద్ర చాలా ఇబ్బంది పడ్డారని సన్నీహితులు చెబుతున్నారు. ఈయన గుంటూరులోని రమేష్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా.. సమస్య మరింత తీవ్రమవ్వడంతో తుది శ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కుమారుడ్ని కోల్పోయిన మహేంద్రకు.. నటుడు మాదాల రవి వరుసకు అల్లుడు అవుతారు.
Also Read: Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!
సీనియర్ నిర్మాత మృతి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా తెలుగు సినీ పరిశ్రమలో వర్క్ చేసిన మహేంద్ర ఎ.ఎ.ఆర్ట్స్ – గీతా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై మొత్తం 36 సినిమాలను నిర్మించారు. “పోలీస్” మూవీతో శ్రీహరిని హీరోగా పరిచయం చేశాడు. అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను “లక్ష్మీ కల్యాణం” పరిచయం చేసింది కూడా ఈయనే.
Also Read: Rahul Gandhi Letter: విద్యార్థులకు అండగ రాహుల్.. ప్రధానికి బహిరంగ లేఖ.. వైఫల్యాలపై నిలదీత!
“ప్రేమించి పెళ్లి చేసుకో” మూవీతో నిర్మాతగా మారిన మహేంద్ర కూలీ, ఒక్కడే, పోలీస్, దేవా, లక్ష్మీ కల్యాణం, అమ్మ లేని పుట్టిల్లు తదితర మూవీస్ నిర్మించారు. కన్మణి డైరక్షన్ లో రాజశేఖర్ నటించిన “అర్జునా” చివరి సినిమా. అయితే, ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆయన ఆర్ధికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.