High Court: గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తి వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మెయిన్ ఎగ్జామ్స్ సెంటర్ల కేటాయింపు, మార్కుల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పలువురు ఆభ్యర్థులు గతంలో హైకోర్టులో పిటిషన్లు వేశారు. గత నెల విచారణ జరిగినప్పుడు మరోసారి మార్కుల మూల్యాంకనం చేయాలని, మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై టీజీ పీఎస్సీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ నిపుణులతో మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం చేయించామన్నారు.
Also Read: Phone Tapping Case: సిట్ ఎదుటకు.. రెండోసారి ప్రభాకర్ రావు!
నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న హైకోర్టు గ్రూప్-1 నియామకాలపై స్టే విధించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చని ఆదేశించింది. బుధవారం విచారణ సందర్భంగా స్టే వెకేట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కౌంటర్ దాఖలు చేసేందుకు టీజీపీఎస్సీ, ఇతర న్యాయవాదులు సమయం కోరారు. విచారణను ఆలస్యం చేయొద్దని, దీని వల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని హైకోర్టు తెలిపింది. వినిపించిన వాదనలే మళ్లీ వినిపించొద్దని పేర్కొంది. ఈనెల 30వ తేదీన పూర్తి స్థాయి వాదనలు వింటామని స్పష్టం చేసింది.
Also Read:Government Plans: పథకాల ప్రచారంపై.. సర్కార్ ఫోకస్!