Singer Mangli Controversy: సింగర్ మంగ్లీపై చేవెళ్ల పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన పుట్టినరోజును పురస్కరించుకొని చేవెళ్ల ఈర్లపల్లి ప్రాంతంలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ పార్టీ (Singer Mangli Birthday Party) ఇచ్చింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్టు సమాచారం రావటంతో, వెంటనే ఎస్ఓటీ అధికారులు, చేవెళ్ల పోలీసులు దాడి జరిపి, తనిఖీ చేయగా.. పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సీసాలు పోలీసులకు లభించాయి. అనంతరం పార్టీకి వచ్చిన వారందరికీ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో 9 మంది గంజాయి సేవించినట్టుగా వెళ్లడయ్యిందని పోలీసులు మీడియాకు తెలిపారు. అనుమతి తీసుకోకుండానే విదేశీ మద్యంతో ఈ పార్టీ జరిపించినట్లుగా భావించి పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల వాదన ఇలా ఉంటే, సింగర్ మంగ్లీ మాత్రం.. అనుమతి మాత్రమే తీసుకోలేదు కానీ, వార్తల్లో హైలైట్ అవుతున్న ఇతర విషయాలేవీ అక్కడ జరగలేదని చెబుతున్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..
Also Read- Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!
‘‘అందరికీ నమస్కారం, నిన్న ఏదయితే నా బర్త్‌డే పార్టీ జరిగిందో.. ఒక చిన్న ఇంట్లో పార్టీలాగా, ఒక చిన్న ఫంక్షన్‌లా జరుపుకోవాలనే ఉద్దేశంతో.. ఆ రిసార్ట్‌లో మా అమ్మానాన్నల కోరిక మేరకు, వారితో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మానాన్నలు, వారి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండటం జరిగింది. వారి కోసం లిక్కర్, సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాము. నాకు లిక్కర్‌కి, సౌండ్ సిస్టమ్‌కి అనుమతి తీసుకోవాలని అస్సలు తెలియనే తెలియదు. దానిపై నాకసలు ఐడియా కూడా లేదు. అనుకోకుండా సడెన్‌గా ప్లాన్ చేసుకున్న కార్యక్రమం అది. అందుకే నాకు అవగాహన కూడా లేదు. లేదంటే, కచ్చితంగా నేను అనుమతి తీసుకుని ఉండేదాన్ని. నన్నెవరు గైడ్ చేసే వారు కూడా లేరు. ఎవరైనా గైడ్ చేసి ఉంటే కచ్చితంగా అనుమతి తీసుకునేదాన్ని. నాకు తెలిస్తే.. ఎందుకిలా చేస్తాను?
బర్త్‌డే పార్టీ కాంట్రవర్సీపై మంగ్లీ వివరణ#SingerMangli #BirthdayParty #Controversy pic.twitter.com/sEuEtOH83o
— Balu Kondapalli (@Balu2070) June 11, 2025
Also Read- Mega157: పరుగులు పెట్టిస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే రెండో షెడ్యూల్!
నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు.. తెలియకుండానే అంతా జరిగిపోయింది. అలాగే అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు వాడటం జరగలేదు. అక్కడ పోలీసులు సెర్చ్ చేసినా ఏం దొరకలేదు కూడా. అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని పోలీసులు చెబుతున్నారో.. ఆయన ఎక్కడో వేరో చోట తీసుకున్నాడని తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నాము. నేను అసలు ఎందుకిలా చేస్తాను? నాకు తెలిస్తే ఎందుకు చేస్తాను? మా అమ్మానాన్నలను ఫంక్షన్‌లో పెట్టుకుని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తానా? ఒక రోల్ మోడల్‌గా, అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉండాలని అనుకునే నేను, ఎందుకలాంటి పనులు చేస్తాను. దయచేసి, మీడియా మిత్రులకు నా విన్నపం ఏమిటంటే.. ఆధారాలు లేని అభియోగాలు నాపై అస్సలు మోపవద్దు..’’ అని మంగ్లీ కోరారు. దీంతో ఈ విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. ఫైనల్‌గా ఎటు దారితీస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు