Ponnam Prabhakar (imagecredit:swetcha)
తెలంగాణ

Ponnam Prabhakar: రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న , ఆయిల్ ఫాం ఇతర ఏదైనా పంటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతు పొలంలో ఎడ్ల నాగలితో దుక్కిదున్ని మంత్రి విత్తనాలు చల్లారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులు ఎక్కడ ఖాళీ జాగా బీడు లేకుండా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం తరపున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం తమదన్నారు.

ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రం

ఈ సారి మంచి వర్షాలు, పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని, తానే స్వయంగా విత్తనాలు అందిస్తానన్నారు. మొన్ననే హుస్నాబాద్ లో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఆ కార్యక్రమం ద్వారా రైతాంగానికి నూతన వ్యవసాయ విధానాలు, పద్ధతులు పై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. పంటలు, యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: Civil Rights Day: ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంలో.. సత్వర చర్యలు చేపట్టాలి!

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సతిసనేతంగా పూజలు చేసిన మంత్రి.

హుస్నాబాద్‌లో ని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతిసనేతంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజక, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ నిర్వహించిన చండీ హోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఈ ఓ కిషన్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్, కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కంది తిరుపతిరెడ్డి, బోయిని నిర్మల జయరాజ్, ఆర్డిఓ వి రామ్మూర్తి, మాజీ కౌన్సిలర్లు, జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.

Also Read: HYDRA Commissioner: చింతల్ బస్తీలో నాలా ఆక్రమణలపై.. హైడ్రా కమిషనర్ ఫైర్!

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?