AS Ravi Kumar Chowdary: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి మృతి చెందారు. గత కొంతకాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయన మంగళవారం రాత్రి హార్ట్ ఎటాక్ తో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం
తెలుపుతున్నారు.
Also Read: UPSC Recruitment 2025: లైఫ్ సెట్ అయ్యే జాబ్స్.. యూపీఎస్సీలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
గోపిచంద్ హీరోగా ‘యజ్జం’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన ఏఎస్ రవికుమార్. ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్ తేజ్‌తో ” పిల్లా నువ్వులేని జీవితం” , గోపిచంద్‌తో ” సౌఖ్యం” , నితిన్‌తో ” ఆటాడిస్తా” వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఆయన చివరిగా రాజ్‌తరుణ్‌తో ‘తిరగబడరా సామి’ చిత్రాన్ని తీశారు.
Also Read: Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!
ఈ వార్త విన్న ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే, ఆయన గత కొంత కాలం నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగులో చేసిన చిత్రాలు హిట్ అవ్వకపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
Also Read: Ram Charan: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ .. ఆ స్టార్ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త సినిమా..