Folk Singer (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Folk Singer: ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం!

Folk Singer: హైదరాబాద్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ ఇచ్చిన పుట్టిన రోజు వేడుకలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపురా రిసార్ట్ లో జరిగిన ఈ వేడుకలపై పోలీసులు దాడులు చేశారు. భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన పరీక్షలు చేసినట్లు సమాచారం. అందులో పలువురికి గంజాయి పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.

చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్ట్ లో మంగళవారం రాత్రి ఈ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి సినీ రంగానికి చెందిన వారితో పాటు పలువురు యువత హాజరయ్యారు. అయితే వేడుకల్లో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది.. రిసార్ట్ పై దాడులు జరిపారు. గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో పార్టీకి హాజరైన వారిలో పలువురు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.

Also Read: KCR: కమిషన్ వద్దకు బయల్దేరిన కేసీఆర్.. ఇంతలో కవితకు ఊహించని షాక్!

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టుబడటంతో సామాజికంగానే కాకుండా సినీ వర్గాల పరంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సింగర్ మంగ్లీకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ఉంది. అటు తెలంగాణ జానపద గీతాలను పాడి ఆమె ఎంతో ఫేమస్ అయ్యారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దీని వెనక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read This: AS Ravi Kumar Chowdary: సినీ ప‌రిశ్ర‌మ‌లో మరో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి మృతి

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?