KCR: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram commission) ముందు హాజరయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బయల్దేరారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఆయన.. ఉ.11.30 గంటలకు బీఆర్కే భవన్ లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు 9 మంది బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇచ్చారు. వారిలో హరీశ్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy), పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
కవితకు దక్కని చోటు
అంతకుముందు బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత.. తన తండ్రి కేసీఆర్ ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కలిశారు. లేఖ వివాదం తర్వాత ఆమె ఫస్ట్ టైమ్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. మరోవైపు కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా తన తాతను కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ నోటీసులకు సంబంధించి కేసీఆర్ తో కవిత చర్చించినట్లు తెలిసింది. అయితే బీఆర్కే భవన్ కు వెళ్లే వారి జాబితాలో కవిత పేరు లేకపోవడం ప్రశ్నలకు తావిస్తోంది. ఆమెను కేసీఆర్ కావాలనే దూరం పెట్టారా అన్న అనుమానాలకు తావిస్తోంది.
బీఆర్కే భవన్ కు పీసీ ఘోష్!
కేసీఆర్ ను విచారించనున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh).. కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ (BRS Bhavan)కు చేరుకున్నారు. కేసీఆర్ రాక కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమ పార్టీ అధినేత విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు (BRS Cadre) అక్కడకు తరలివచ్చారు. అధికార కాంగ్రెస్ కావాలనే కాళేశ్వరంపై రాజకీయం చేస్తోందని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Also Read: BRS Party: కాసేపట్లో కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ఇక తగ్గేదేలే!
కేటీఆర్.. ఆసక్తికర ట్వీట్
మరోవైపు తన తండ్రి కాళేశ్వరం విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. 60ఏళ్లలో జరగని పనులను కేసీఆర్ విజయవంతంగా చేసి చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్ కేవలం.. తెలంగాణ కోసమే పనిచేశారని అన్నారు. కాళేశ్వరం ద్వారా కరువు, దాహానికి పరిష్కారం చూపారని కొనియాడారు. కేసీఆర్ ను అర్థం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవిత కాలం చాలదని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.