Shaiva Group: రాష్ట్రానికి రూ.2125కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. సచివాలయంలో రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నాయి. రాష్ట్రానికి చెందిన ఐదు కంపెనీలతో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ కంపెనీలతో కొత్తగా మరో 5020 మంది తెలంగాణ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పం అని పేర్కొన్నారు.
అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా
18 నెలల్లో 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఏడాదిన్నర కాలంలో రూ.3లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చామన్నారు. ప్రైవేట్ రంగంలోనూ లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయని, ఈ ప్రయాణంలో మరో గొప్ప అడుగు ముందడుగు వేశామన్నారు. అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ధీటుగా దూసుకెళ్తున్న తెలంగాణ పురోగతిలో భాగస్వామయ్యేందుకు ముందుకొచ్చిన యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ ను ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.
Also Read: Mahabubabad: పాఠశాలలో శానిటేషన్.. హెల్త్ ఎడ్యుకేషన్ ప్రత్యేక దృష్టి పెట్టాలి!
రూ.255 కోట్లు పెట్టుబడులు
శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంయుక్తంగా రివలేషన్స్ బయోటెక్ లో రూ.1360 కోట్లు, మనాకిన్ బయోలో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్ మెంట్స్ అడ్వైజర్స్ లో రూ.80 కోట్లు, ఎగ్జిగెంట్ డ్రిల్లింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.90 కోట్లు, యంత్ర టెక్ కంట్రోల్స్ లో రూ.255 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో బయోటెక్, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫిన్ టెక్, పబ్లిక్ సెక్టార్స్ తదితర రంగాల్లో లో మరో రూ.24వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు.
ఏఐ సిటీలో పెట్టుబడులు
ఈ రెండు కంపెనీలు రాబోయే మూడేళ్లలో బయోటెక్ రంగంలో తినుబండారాల్లో చక్కెర శాతాన్ని తగ్గించడం, యాంటీ డయాబెటిక్, ఫుడ్ మేనేజ్ మెంట్ ఉత్పత్తులు, పబ్లిక్ సెక్టార్ లో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. తెలంగాణ ఒక రాష్ట్రం కాదు.. అవకాశాల గని అని, ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రం అని, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు గమ్యస్థానం అని పేర్కొన్నారు.
Also Read: KTR: సీడ్ కంపెనీల.. అక్రమాలను అడ్డుకోవాలని!