Pawan kalyan: పవన్ స్పీడ్ మామూలుగా లేదుగా!
Ustaad Bhagat Singh
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan kalyan: ఉస్తాద్ వంతు.. పవర్ స్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Pawan kalyan: ఓవైపు రాజకీయాలు. ఇంకోవైపు సినిమాలు. రెండింటినీ చక్కగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల నేపథ్యంలో గతంలో కమిట్ అయిన మూడు సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అయితే, ఈ మధ్యే హరిహర వీరమల్లు (Harihara Veeramallu) మూవీ పెండింగ్ షూటింగ్ పూర్తి చేయగా, సినిమా విడుదలకు సన్నద్ధమవుతున్నది. అలాగే, కొద్ది రోజులుగా ఓజీ (OG) షూటింగ్ శరవేగంగా జరిగింది. ఈ చిత్రం పెండింగ్ పార్ట్ కూడా పవన్ పూర్తి చేశారు. ఇక, మిగిలిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్‌ను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నారు.

చాలా రోజుల తర్వాత షెడ్యూల్

డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shanker) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా కాలానికి ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొదలైంది. మంగళవారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో షూటింగ్‌కు హాజరైనట్టు చిత్రబృందం ప్రకటించింది. పవన్ రాకతో సెట్స్‌లో జోష్ నెలకొన్నది. ప్రస్తుత షెడ్యూల్‌లో పవన్‌తోపాటు సినిమాలోని తారాగణం మొత్తం షూటింగ్‌లో పాల్గొంటున్నది.

Read Also- Honeymoon Case: భర్తను చంపేశాక.. వెలుగులోకి ‘సోనమ్’ క్రిమినల్ ఆలోచనలు

సాకేతిక నిపుణులు వీరే..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని నిర్మిస్తున్నారు. ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ సారథ్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, స్క్రీన్‌ప్లే దశరథ్, అడిషినల్ రైటింగ్‌ బాధ్యతలు సీ చంద్ర మోహన్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితమే ఓజీ పూర్తి

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఓజీ మూవీ తెరకెక్కింది. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్ శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాదే ఈ మూవీ షూటంగ్ పూర్తి కావాల్సి ఉండగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వాయిదా పడింది. రెండు రోజుల క్రితమే పెండింగ్ పార్ట్‌ను పూర్తి చేయడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. మరోవైపు, హరిహర వీరమల్లు చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. అయితే, వాయిదా పడుతున్న ఈ మూవీ ఓజీ రిలీజ్ తర్వాత చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.

Read Also- Russia Vs Ukraine: రాత్రికి రాత్రే.. ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడి

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..