Gaddar Awards 2024
ఎంటర్‌టైన్మెంట్

Gaddar Film Awards: ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’.. షీల్డ్ చూశారా!

Gaddar Film Awards: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు కళాకారులకు ‘నంది’ అవార్డ్స్ (Nandi Awards)ను ఇచ్చిన విషయం తెలిసిందే. నంది అవార్డ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే గత తెలంగాణ ప్రభుత్వం ‘నంది’ అవార్డ్స్ ప్లేస్‌లో ‘సింహా’ అవార్డ్స్ (Simha Awards) ఇస్తామని ప్రకటించింది. ఇవ్వలేదు అనుకోండి.. కానీ సింహా అవార్డ్ నమునా కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. కానీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ నమూనా ఎలా ఉంటుంది? అనేది ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు. గద్దర్ ఇమేజ్‌తో అవార్డ్ ఉంటుందా? అని సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, రేవంత్ సర్కార్, ఈ అవార్డ్స్‌ను రెడీ చేసిన తీరు.. అందరినీ మెప్పిస్తోంది. తాజాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించి ఓ ప్రకటన వచ్చింది. 2014 జూన్ నుండి 2024 డిసెంబర్ 31 వరకు సెన్సార్ జరుపుకున్న చిత్రాల్లో ఉత్తమ చిత్రాలతో పాటు, ఇతర కేటగిరీలకు సంబంధించిన అవార్డుల వేడుక జూన్ 14న జరపబోతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు ‘గద్దర్ అవార్డ్’ షీల్డ్ ఎలా ఉంటుందో.. ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అవార్డ్‌ని చూసిన వారంతా.. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా అవార్డ్‌ను డిజైన్ చేయించింది అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read- Housefull 5: టాక్ వీక్.. అయినా అదిరిపోయే కలెక్షన్స్!

ఇక అవార్డుల విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇకపై కళాకారులకు ‘తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ఇస్తామంటూ ఇటీవలే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు, సాంకేతిక నిపుణులతో పాటు.. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకున్న చిత్రాల్లోని ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఇందులో భాగంగా అవార్డ్స్‌ ఇవ్వనున్నట్లుగా తెలుపుతూ.. విజేతల జాబితాను కూడా ప్రకటించారు. ఈ అపూర్వ వేడుక కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

Gaddar Award

Also Read- Akhanda 2 Teaser: ఉగ్ర నరసింహుడి అవతారం.. ఈసారి బాక్సాఫీస్ గల్లంతే!

జూన్‌ 14న అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో, అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ గద్దర్‌ అవార్డులు -2024కు ఎంపిక కావడం పట్ల ఇప్పటికే అవార్డుల విజేతలు, తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభను గుర్తించి తగు రీతిలో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ వేడుకను సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు వంటి వారంతా కలిసి ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..