HouseFull 5 Poster
ఎంటర్‌టైన్మెంట్

Housefull 5: టాక్ వీక్.. అయినా అదిరిపోయే కలెక్షన్స్!

Housefull 5: బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కొన్నాళ్లుగా హిట్ కోసం ఎలాంటి దండయాత్ర చేస్తున్నారో బాలీవుడ్ (Bollwood) ప్రేక్షకులకే కాదు, ఇతర ఇండస్ట్రీలలోని వారికి కూడా తెలుసు. ఇప్పుడొచ్చిన ‘హౌస్‌ఫుల్ 5’ కూడా విడుదల రోజు టాక్ నెగిటివ్‌గా వచ్చినా, కలెక్షన్లపై అది ఏ మాత్రం పడలేదు. మొదటి వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా రూ. 79 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. వారాంతపు కలెక్షన్లో ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ టాప్ 5 చిత్రాలలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Also Read- Akhanda 2 Teaser: ఉగ్ర నరసింహుడి అవతారం.. ఈసారి బాక్సాఫీస్ గల్లంతే!

జూన్ 6వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రం అక్షయ్ కుమార్ టాప్ ఓపెనింగ్ వారాంతాల్లో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ‘సూర్యవంశీ’, ‘మిషన్ మంగళ్’ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘సూర్యవంశీ’ మొదటి వారాంతం రూ. 76.75 కోట్లు రాబట్టగా, ‘మిషన్ మంగళ్’ రూ. 67.50 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత స్థానాల్లో ఉన్న ‘గుడ్ న్యూజ్’ సినిమా రూ. 64.15 కోట్లు, ‘హౌస్‌ఫుల్ 3’ సినిమా రూ. 53.25 కోట్లు రాబట్టాయి. సోమవారం కూడా ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం టికెట్ల ధరల విషయంలో కాస్త డిస్కౌంట్స్ నడుస్తాయి కాబట్టి.. మంగళవారం కూడా ఈ సినిమా కలెక్షన్స్‌కి ఢోకా ఉండదు. ‘హౌస్‌ఫుల్ 5’కి అసలు పరీక్ష బుధవారం నుంచి మొదలవుతుంది. బుధవారం కనుక నిలబడితే మాత్రం.. ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే, మరోసారి అక్షయ్ కుమార్ సినిమా నిర్మాతలను నిరాశకులోనయ్యేలా చేస్తుంది.

Also Read- Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!

‘హౌస్‌ఫుల్ 5’ చిత్ర విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పడే, నానా పటేకర్, డీనో మోరియా తదితరులు నటించిన ఈ సినిమా తరుణ్ మన్సుఖాని దర్శకత్వంలో తెరకెక్కింది. ‘హౌస్‌ఫుల్’ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రాంఛైజీలో 5వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను చూసిన వారంతా.. రొటీన్ కామెడీ ఎంటర్‌టైనరే అనేలా రియాక్ట్ అవుతున్నారు. కామెడీ కాస్త వర్కవుట్ అవడంతో కలెక్షన్లు ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయని బాలీవుట్ ట్రేడ్ మాట్లాడుకుంటోంది. ఇక అక్షయ్ కుమార్‌కు హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఆయన నటిస్తున్న సినిమాలకు పెడుతున్న బడ్జెట్, వస్తున్న కలెక్షన్లు చూస్తే.. గత కొన్ని సినిమాలుగా ఆయన నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. అయినా కూడా అక్షయ్ కుమార్ పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సంవత్సరానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..