Akhanda 2 Teaser: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). ఈ సినిమా కోసం బాలయ్య, బోయపాటి నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుందని ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ హామీ ఇచ్చాయి. తాజాగా నటసింహం బాలయ్య పుట్టినరోజు (జనవరి 10)ను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ బాలయ్యలోని ఉగ్ర నరసింహుడి అవతారాన్ని తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈసారి బాక్సాఫీస్ గల్లంతవడం పక్కా అని చెప్పేయవచ్చు.
Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టీజర్‌ని గమనిస్తే.. బాలయ్య విస్పోటనాన్ని ఇందులో చూడవచ్చు. ఫస్ట్ పార్ట్ ‘అఖండ’ను మించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని ప్రతి షాట్ తెలియజేస్తుంది. ముఖ్యంగా నందమూరి నటసింహానికి ‘సింహం’ అనే పేరుని సార్థకం చేసేలా ఈ పార్ట్ ఉండబోతుందనేది అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే, టైటిల్‌కి తగ్గట్టుగానే తాండవమే అని చెప్పొచ్చు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మరోసారి థియేటర్లకు ఈ టీజర్‌తో హెచ్చరికలు పంపించినట్లుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ దంచేశాడు. మరోసారి థియేటర్లు దద్దరిల్లిపోతాయి.. మీరు చూస్తారు అనేలా థమన్ ఇచ్చిపడేశాడు. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా! అమాయకుల ప్రాణాలు తీస్తావా?’ అంటూ బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్, ‘వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది’ డైలాగ్, త్రిశూలం మెడ చుట్టూ తిప్పుతూ రక్తపాతం సృష్టించే షాట్.. ఈ టీజర్‌కే హైలైట్. ‘తగతగ తాండవం దా’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్.. గూజ్‌బంప్స్ అంతే. బాలయ్య బర్త్‌డేకి పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా ఈ టీజర్‌ని కట్ చేశారు. ప్రస్తుతం ట్రెండ్‌ని బద్దలు కొడుతూ టాప్‌లో ఈ టీజర్ వైరల్ అవుతోంది.
Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టగలరా?
ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలయ్య బిడ్డ ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ టీజర్ అనౌన్స్ పేరుతో విడుదల చేసిన పోస్టరే సోషల్ మీడియాను షేక్ చేసి, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. టీజర్‌తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేసేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైనమిక్ యాక్టర్ ఆది పినిశెట్టి ఇంటెన్స్ పాత్రని పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకు పని చేస్తోంది. సి రాంప్రసాద్ డీవోపీగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, AS ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా అద్భుతమైన పనితనాన్ని కనబరుస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు