Tollywood Hero: ఈ ఫొటోలో ఓ హీరో తన ఫ్యామిలీతో కలిసి ఉన్నాడు. ఆ హీరో ఎవరో కనిపెట్టండి చూద్దాం. టాలీవుడ్‌కి చెందిన ఈ హీరో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్స్‌తో ఒకప్పుడు టాలీవుడ్‌ని షేక్ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ ఎవరూ లేకపోయినా, సెలక్ట్ చేసుకున్న సినిమాలతోనే మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల కలల రాకుమారుడుగా కూడా గుర్తింపు పొందాడు. కానీ ఏం లాభం, ఆ వైభవమంతా మూడు నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ సెన్సేషన్‌గా మారిన ఈ హీరో, ఆ తర్వాత హిట్ కోసం ఎంతగానో పరితపించాడు. సినిమా సెలక్షన్స్ విషయంలో గాడి తప్పాడు. పెళ్లి తర్వాత ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇంట్లో చికాకులు, వరుస ఫ్లాప్స్ ఈ హీరోని డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయి. అంతే, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
Also Read- Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్
ఇంకా అర్థం కాలేదా? ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో కాదు? అప్పట్లో యంగ్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ‘ఉదయ్ కిరణ్’. అతని చిన్నప్పటి ఫొటో ఇది. తన ఫ్యామిలీ అందరితో కలిసి ఉన్న ఈ రేర్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోని చూసిన వారంతా వెంటనే ఉదయ్ కిరణ్ అని గుర్తు పడుతూ.. ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. మొదటి సినిమాతోనే తిరుగులేని సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అవకాశాలను సొంతం చేసుకున్నారు. అవకాశాలతో పాటు వరుస హిట్స్ కూడా ఆయనని పలకరించాయి. దీంతో స్టార్ హీరో స్థాయికి చేరుకునే సమయంలో అతని లైఫ్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లుడిగా వెళ్లాల్సిన ఉదయ్ కిరణ్.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య.. నార్మల్ వ్యక్తిగా మారిపోవాల్సి వచ్చింది.
Also Read- Shobana: నటి శోభనకే ఇలాంటి అవమానమా! సెట్‌లో బిగ్ బి లేకపోయి ఉంటే?
అతని మరణం వెనుక ఏం జరిగిందనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ విషయంలో చిరంజీవిని అనుమానిస్తూ కొందరు కామెంట్స్ చేసినా, స్వయంగా ఉదయ్ కిరణ్ అక్కే.. ఆ కామెంట్స్‌ని ఖండించింది. చిరంజీవి తమ కుటుంబానికి ఎంతో హెల్ప్ చేశారని తెలిపింది. అయినా సరే, చిరంజీవిపై వార్తలు ఆగడం లేదు. ఇంకా ఇంకా ఈ ప్రస్తావనలో చిరంజీవి పేరును వాడుకునేవారు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు తప్పితే.. తగ్గడం లేదు. ఇక ఈ ఫొటో విషయానికి వస్తే.. ఈ ఫొటోలో చిన్నప్పటి ఉదయ్ కిరణ్‌తో పాటు ఉంది ఎవరంటే.. ఆయన తండ్రి వి.కె. మూర్తి, తల్లి నిర్మల, అక్క శ్రీదేవి, అన్నయ్య వినయ్. ఇదే ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు