Akhil Zainab Reception: ప్రేమ జంట అక్కినేని అఖిల్, జైనాబ్‌ల వివాహం జూన్ 6వ తేదీన కింగ్ నాగార్జున ఇంట్లో తెల్లవారు జామున 3 గంటల 35 నిమిషాలకు కుటుంబ సభ్యుల, సెలక్టెడ్ సెలబ్రిటీల మధ్య ధూమ్ ధామ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన నాగార్జున.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంధువులందరి సమక్షంలో అఖిల్, జైనాబ్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగినందుకు అమల, తను ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా తెలిపారు.
Also Read- Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫ్యామిలీ పిక్ వైరల్
పెళ్లి సెలక్టెడ్ పీపుల్ మధ్య జరిపినా.. రిసెప్షన్‌కు మాత్రం చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు కింగ్ నాగార్జున (King Nagarjuna). ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో తారాతోరణం మధ్య ఈ అఖిల్, జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అఖిల్, జైనాబ్‌లను ఆశీర్వదించారు.
నూతన జంటకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు.
విక్టరీ వెంకటేష్ తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ఉపాసన దంపతులు అఖిల్, జైనాబ్ రిసెప్షన్‌లో సందడి చేశారు.
‘పెద్ది’ టీమ్‌కు చెందిన హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సుకుమార్.. ఈ రిసెప్షన్ హాజరయ్యారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), తన తదుపరి చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.
న్యాచురల్ స్టార్ నాని తన వైఫ్‌లో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.
కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యష్ ఈ వేడుకకు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్, కెఎల్ నారాయణలు ఈ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సినీ నటుడు శ్రీ @iamnagarjuna , అమల గారి కుమారుడు అఖిల్ అక్కినేని – జైనాబ్ రావ్జీ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. @AkhilAkkineni8 , జైనబ్ దంపతులైన ఈ జంటకు ఆనందం, ఐశ్వర్యం నిండి చిరకాలం కలసి ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించడం… pic.twitter.com/ey3TCiXdEQ
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) June 8, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు