Akhil Zainab Reception: లవ్ జంట అక్కినేని అఖిల్, జైనాబ్‌ల వివాహం జూన్ 6వ తేదీన కింగ్ నాగార్జున ఇంట్లో.. కుటుంబ సభ్యుల, సెలక్టెడ్ సెలబ్రిటీల మధ్య ధూమ్ ధామ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన నాగార్జున.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంధువులందరి సమక్షంలో అఖిల్, జైనాబ్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగినందుకు అమల, తను ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా తెలిపారు. కానీ, అక్కినేని అభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కినేని వారసుడు అఖిల్ బాబు పెళ్లి వేడుకను చూడాలని వారికి కూడా ఉంటుంది కదా. కనీసం లైవ్ ప్రోగ్రామ్ అయినా పెట్టించి ఉంటే, అంతా చూసే వాళ్లం అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా వ్యక్తపరచడం విశేషం. పెళ్లి సైలెంట్‌గా కుటుంబ సభ్యుల, కొద్ది మంది అతిథులు సమక్షంలో చేశారు సరే.. రిసెప్షన్‌కి అయినా ఫ్యాన్స్‌ని పిలుస్తారా? అనే డౌట్ అందరిలో ఉంది.
Also Read- Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!
కానీ, రిసెప్షన్‌కు కూడా ఫ్యాన్స్‌ని దూరం పెట్టేశారు కింగ్ నాగార్జున. మొత్తంగా ఈ పెళ్లి తంతుని పర్సనల్‌గా తీసుకున్నారు కింగ్. అందుకే రిసెప్షన్‌కు కూడా ఫ్యాన్స్, మీడియాకు పిలుపు రాలేదు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్, జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు చాలా గ్రాండ్‌గా అక్కినేని ఫ్యామిలీ ఎరేంజ్‌మెంట్స్ చేసింది. ఫుడ్ విషయంలోనూ, గెస్ట్‌ల రిసీవింగ్, ఇతరత్రా అన్నీ కూడా ఫారెన్ లెవల్‌లో ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించి అక్కినేని ఫ్యామిలీ అంతా ఉన్న పిక్ ఒకటి బయటికి వచ్చేసి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ పిక్‌ని అక్కినేని అభిమానులు షేర్ చేస్తూ నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు, జైనాబ్‌కి సంబంధించిన ఫ్యామిలీ పిక్ కూడా ఒకటి విడుదల చేశారు. ఈ పిక్ కూడా వైరల్ అవుతోంది.
అక్కినేని ఫ్యామిలీ పిక్ విషయానికి వస్తే.. నాగార్జున సోదరులతో పాటు సోదరి ఫ్యామిలీ, వారి పిల్లలు, నాగ చైతన్య – శోభిత దంపతులు, సుశాంత్, సుమంత్, సుప్రియ వంటి వారంతా ఉన్నారు. ఈ పిక్‌కు చాలా మంచి కామెంట్స్ పడుతున్నాయి. ఫ్యామిలీకి నాగార్జున ఇచ్చే ఇంపార్టెన్స్ ఇలా ఉంటుందని, అంతా కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read- NBK111: బాలయ్య 111వ సినిమా ఫిక్స్.. దర్శకుడెవరంటే..?
6 నెలల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు
అక్కినేని ఫ్యామిలీలో 6 నెలల వ్యవధిలోనే రెండు పెళ్లిళ్లు జరగడం విశేషం. 2024 డిసెంబర్‌లో నాగ చైతన్య, శోభితల పెళ్లిని జరిపించిన నాగార్జున, ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్ పెళ్లిని ఆయన ప్రేమించిన జైనాబ్‌తో గ్రాండ్‌గా జరిపించారు. ఈ రెండు పెళ్లిళ్లు కూడా కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల సమక్షంలోనే జరిపించడం విశేషంగా చెప్పుకోవాలి. నాగ చైతన్య, సమంతల పెళ్లిని ఏ రేంజ్‌లో నాగ్ జరిపించారో తెలియంది కాదు. కాకపోతే ఆ పెళ్లి నిలబడలేదు. అందుకే, నాగ్ ఈసారి తన కుమారుల పెళ్లి విషయంలో ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి మరి జరిపించారని ఇండస్ట్రీలోని వారంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం నూతన జంటకు మాత్రం, వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో హాయిగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు