Arun Kumar Jain: రెండు చక్రలు ఒకే లక్ష్యం అని, సైక్లింగ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. విదేశాల్లో ఇప్పుడు మళ్లీ చాలా మంది ఫిట్‌నెస్ కోసం సైక్లింగ్‌కు మళ్లుతున్నారనీ తెలిపారు . దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఫిట్ ఇండియా సైక్లోధాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంశించారు. రైల్వే అధికారులు, క్రీడాకారులతో కలిసి సైకిల్ తొక్కారు.
Also Read: Errolla Srinivas: నీటి ప్రయోజనాలు రేవంత్‌కు పట్టవా?.. బీఆర్ఎస్ నేత ఫైర్!
ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులకు ఆరోగ్యపరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండటం ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించిందని పేర్కొన్నారు. దీంతో పర్యావరణ హితమైనదే కాకుండా శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొన్నారు. ప్రతి రైల్వే ఉద్యోగి ఈ ఉద్యమంలో చురుకుగా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు ప్రధాన నిర్వహణాధికారి నీరజ్ అగర్వాల్ , డీఆర్‌ఎం భర్తేష్ కుమార్ జైన్ , ప్రజాసంభంధాల అధికారి ఏ.శ్రీధర్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు, దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైల్వే క్రీడాకారులు పాల్గొన్నారు.
Also Read: Young Man Dies: హనీమూన్‌కు వెళ్తున్న వేళ.. రైల్వే స్టేషన్‌లో విషాదం!