Suniel Narang Resign
ఎంటర్‌టైన్మెంట్

Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!

Suniel Narang: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కానీ, ఇటీవల ఈ సినిమా విషయంలో వెల్లువెత్తిన వివాదాలు మాత్రం కొందరికీ నిద్రలేని రాత్రులని ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ‘ఆ నలుగురు’ మైత్రిని విడగొట్టి, ఇండస్ట్రీలో సంచలన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇప్పటికే అల్లు అరవింద్ నా దగ్గర అసలు థియేటర్లే లేవని, ఏపీలో మాత్రమే 15 థియేటర్లు ఉన్నాయని మీడియా సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. తెలంగాణలో కేవలం ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కాబట్టి.. ‘ఆ నలుగురు’ లిస్ట్‌లో నుంచి నన్ను తీసేయాలని మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించి తన దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయో క్లారిటీ ఇస్తూ.. థియేటర్లు ఎక్కువ ఉన్నది ఏషియన్ సునీల్, సురేష్ బాబు దగ్గరే అని అన్నారు.

Also Read- Mohan Babu: బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తగ్గాలి.. కాదని ఎదిరిస్తేనా?

అటు తిరిగి, ఇటు తిరిగి ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి అధ్యక్షునిగా ఉన్న సునీల్ నారంగ్, ఆ పదవికి రాజీనామా చేసే వరకు తీసుకొచ్చింది. సునీల్ నారంగ్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. థియేటర్ల బంద్ అనే విషయంలో నా పేరు వాడుతూ కొందరు చేసిన కామెంట్స్‌కు బాగా హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. అసలు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగినప్పుడు సీటీలోనే లేనని, ఓ టెంపుల్ విజిట్‌కి వెళ్లినట్లుగా ఆయన ఇప్పటికే చెప్పి ఉన్నారు. అయినా కూడ ఆయన వల్లే థియేటర్ల మాఫియా నడుస్తుందనే మాటలు తీవ్రంగా బాధించడంతో.. తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు.

Also Read- Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!

‘‘నేను జూన్ 7వ తేదీన వరుసగా మూడవసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. ఈ మధ్యకాలంలో నా పేరు ఎలాంటి సంబంధం లేని పబ్లిక్ స్టేట్‌మెంట్స్‌తో ముడిపెట్టి నానా రకాలుగా మాట్లాడుతున్నందుకు చింతిస్తూ.. ఈ పదవి నుంచి వైదొలగుతున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధించి వస్తున్న పబ్లిక్ స్టేట్‌మెంట్స్, ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాలు నన్ను సంప్రదించకుండానే జరుగుతున్నాయి. నా ప్రమేయం లేని చర్యలు, వ్యాఖ్యలకు నేను ఎలాంటి బాధ్యతను తీసుకోను. ఇలాంటి పరిస్థితులలో అధ్యక్ష పీఠంపై కొనసాగడం కష్టంగా ఉంది. నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా నాపై చేసే వ్యాఖ్యలను అనుమతించను. అందుకే, తక్షణమే నా రాజీనామాను సమర్పిస్తున్నాను. నా రాజీనామాను తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ అంగీకరించి, ఆ పదవిలో మరో విజయవంతమైన వ్యక్తిని తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతర వృద్ధి, విజయానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని సునీల్ నారంగ్ ఈ రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. మరో విశేషం ఏమిటంటే.. మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు అందుకున్న సునీల్.. ఆ వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు