Errolla Srinivas: నీటి ప్రయోజనాలు రేవంత్‌కు పట్టవా?..
Telangana News

Errolla Srinivas: నీటి ప్రయోజనాలు రేవంత్‌కు పట్టవా?.. బీఆర్ఎస్ నేత ఫైర్!

Errolla Srinivas: తెలంగాణ నీటి ప్రయోజనాలు సీఎం రేవంతుకు పట్టవా? ఏపీ అక్రమంగా నీటిని తరలించుకు పోతుంటే మొద్దు నిద్ర నటిస్తారా? అని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ నీళ్ళను ఏపీ అక్రమంగా దోచుకెళ్లేందుకు వేగంగా అడుగులు వేస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటూ గురుదక్షిణ చెల్లించే పనిలో నిమగ్నమయ్యాడని ఆరోపించారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

మార్చి 3 వరకు ఏం చేశారు?

బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మార్చి 3 వరకు ఏం చేశారు? ఇదేనా మీరు చెబుతున్న చిత్తశుద్ధి? ఢిల్లీకి వెళ్ళి ఫొటోలు దిగడం తప్ప అడ్డుకునేందుకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా బనకచర్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందం ఏమిటి? బనకచర్ల తో తెలంగాణకు ఏం నష్టం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇప్పటికీ స్పందించడం లేదని ప్రశ్నించారు.

 Also Read: CM Revanth Reddy: కిషన్ రెడ్డి సహకరిస్తే .. తెలంగాణను పరుగులు పెట్టిస్తా సీఎం కీలక వాఖ్యలు!

కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే

తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని, అడ్డుకోవాలని కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి జనవరి 27, 2025 నాడు హరీష్ రావు లేఖ రాశారన్నారు. అయినా కిషన్ రెడ్డి నుంచి ఎలాంటి చెరవలేదని, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో తనకున్న బలంతో చంద్రబాబు, తెలంగాణ నీళ్లను తరలించుకో పోయేందుకు భారీ కుట్ర చేస్తుంటే ఇద్దరు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మొద్దు నిద్ర నటిస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు

చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదా? అని నిలదీశారు. చంద్రబాబుతో బీజేపీ, రేవంతు దోస్తీ చేస్తూ తెలంగాణను మోసం చేస్తారా? బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి నోరు మెదపాలని, లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. ఎంపీ చామల కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర లేపింది ఎవరు? లేవకుండా మొద్దు నిద్ర నటించింది ఎవరు చామలా? సబ్జెక్ట్ తెలియకుండా, ఆబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం మీకే సాధ్యం అన్నారు. నీ మాటలకు తలా, తోకా రెండూ ఉండవని మరోసారి నిరూపించుకున్నావు అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు గురించి, బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడు, లేదంటే నీ అజ్ఞానం బయటపడుతుందన్నారు.

 Also Read: YSRCP: జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యవహారంపై వైసీపీ సంచలన ప్రకటన

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..