Revanth Reddy
Politics

Hyderabad: రుణమాఫీ బలంగా తీసుకెళదాం

  • పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • రానున్న 11 రోజులు కీలకం
  • ఆరు గ్యారెంటీలు, ఉచిత బస్సు పథకాలను వివరించాలి
  • ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
  • 120 రోజుల్లో అమలైన పథకాలను క్షేత్ర స్థాయిలో వివరించాలి
  • ఎవరికి కేటాయించిన బాధ్యతలను వాళ్లు నిర్వర్తించాలి
  • మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఇంఛార్జిలదే
  • సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి

Telangana congress news(TS today news): రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు రెండు వారాల పాటు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులను కోరారు. పార్లమెంట్ ఎన్నికల విజయ లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ సీఎం పార్టీ శ్రేణులతో మంగళవారం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
కష్టపడిన వారికి కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రానున్న 11 రోజులు కీలకమని, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అమలు చేసిన గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు గురించి వివరించాలని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు.

మెజారిటీ తగ్గకుండా చూసుకోవాలి

మంత్రులు, లోక్ సభ నియోజకవర్గాల ఇన్​ఛార్జ్​లు, ఎంపీ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ స్టేట్ ఇన్​ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జ్‌లపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్, స్క్రూటినీ పూర్తయినందున భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ప్రతి మండల, బూత్ స్థాయిలో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సీఎం సూచించారు. 120 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పేదలకు చేకూరుతున్న లబ్దిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు సహా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు కచ్చితంగా నిర్వహించాలని తేల్చి చెప్పారు. పార్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే దీపాదాస్ మున్షీ, ఇంఛార్జ్‌ సెక్రటరీల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించాలని భావించేవారు వీలైనంత త్వరగా వివరాలు ఇచ్చి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. అభ్యర్థులు 11 రోజుల ప్రణాళికను అమలు చేస్తూ గాంధీ భవన్​తో ఎపిప్పటికప్పుడు కో-ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేసి 14 సీట్లను సాధించాలని దిశానిర్ధేశం చేశారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?