maganti gopinath
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ కన్నుమూత.. టీడీపీతో మొదలై.. బీఆర్ఎస్‌లో కీలకమై!

Maganti Gopinath: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ నెల 5న గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న మాగంటి, మూడు నెలల క్రితం దానికి సంబంధించి చికిత్స తీసుకున్నారు. అప్పట్లో ఆయనకు డయాలసిస్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం గుండెపోటు రావడంతో ఏఐజీలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు.

టీడీపీతో మొదలైన రాజకీయ ప్రయాణం

వెండితెర ఇలవేల్పుగా కొలువబడ్డ నటరత్న నందమూరి తారక రామారావు (NTR) 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీ (TDP) ని స్థాపించారు. అప్పటిదాకా తెలుగు గడ్డపై ఏకపక్షంగా ఏలుతున్న కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రాంతీయ పార్టీ రూపంలో ప్రత్యామ్నాయంగా మారారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో 1982లోనే టీడీపీలో చేరారు మాగంటి గోపీనాథ్. 1985లో హైదరాబాద్ తెలుగు యువత అధ్యక్షుడు అయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి, 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. రాష్ట్ర విభజన జరిగి, బీఆర్ఎస్ హవా కొనసాగుతున్న ఆ సమయంలో కూడా సిటీలో టీడీపీ జెండా ఎగురవేశారు. అయితే, రానురాను తెలంగాణలో టీడీపీ పరిస్థితి దిగజారడంతో 2018లో భారత రాష్ట్ర సమితిలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గెలిచారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు.

Shrasti Verma : కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు హామీ

సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

మాగంటి మృతిపై ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన అంతిమ సంస్కారాలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని కూడా భరించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, మాగంటి గోపీనాథ్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర ద్రిగ్బాంతికి గురి చేసిందని అన్నారు. గోపీనాథ్ కింది స్థాయి నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు . కుటుంబానికి తన సానుభూతి తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్ స్పందన 

గోపీనాథ్ మృతి విషయం తెలిసి ఎర్రవెల్లి నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదాపూర్‌లోని ఆయన నివాసానికి బయలుదేరి వెళ్లారు. మాగంటి అకాల మరణం తీవ్ర బాధాకరమని, ఇది పార్టీకి తీరనిలోటు అని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మాగంటి గోపీనాథ్‌ భౌతికకాయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్,  ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు తదితరులు నివాళులర్పించారు.

కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గోపీనాథ్గుం డెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

చంద్రబాబు, లోకేష్ విచారం

గోపీనాథ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం, తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా, తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగిందని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ తెలిపారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు లోకేష్.

Read Also- Gold Rate ( 08-06-2025): తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?