TS Cabinet
తెలంగాణ

Cabinet Expansion: రెడ్డికి లేనట్టే.. నేడు క్యాబినెట్ విస్తరణ

  • బీసీ, ఇద్దరు ఎస్సీలకు ఛాన్స్
  • మూడు బెర్త్‌లు మాత్రమే ఖరారు
  • సుదీర్ఘ చర్చల అనంతరం ఎంపిక
  • నాలుగైతే కోమటిరెడ్డి, సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ
  • చిక్కుల్లేకుండా సమస్యకు చెక్ పెట్టే వ్యూహం
  • సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు

Cabinet Expansion: ఎట్టకేలకు క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్‌లకు క్యాబినెట్‌లో స్థానం లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన కమ్యూనికేషన్ రాజ్‌భవన్ నుంచి కొత్త మంత్రులకు వెళ్ళింది. ప్రస్తుతం క్యాబినెట్‌లో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉండగా మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు బెర్తులు ఇప్పుడు భర్తీ చేస్తుండగా, త్వరలో మిగతా వాటిని నింపనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

రెడ్డి సామాజిక వర్గానికి నో ఛాన్స్

క్యాబినెట్ విస్తరణలో రెడ్డి సామాజికవర్గ నేతల్లో ఎవరికీ చోటు లభించలేదు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిల మధ్య బెర్త్ కాంపిటీషన్ నెలకొన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ నుంచి మంత్రి పదవి హామీ ఉన్నదని, తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేనని, నిజామాబాద్ కోటాలో తనకు ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ప్రభుత్వంపై ప్రెజర్ తెస్తున్నారు. ఇటు, రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా హైకమాండ్‌కు రిక్వెస్ట్ పెట్టారు. కానీ ఏఐసీసీ ఎటూ తేల్చలేదు. నాలుగో బెర్త్‌ను ఖరారు చేస్తే మాత్రం వీరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మూడు బెర్తులను ఖరారు చేసినట్టు సమాచారం.

Also Read: Vivian Jenna Wilson: ట్రంప్‌తో వివాదం.. ఎలాన్ మస్క్ కూతురు షాకింగ్ కామెంట్స్!

త్వరలో మైనార్టీ కోటాలో..

ఇక ఎస్టీ ( లంబాడా) నుంచి డిప్యూటీ స్పీకర్‌గా బాలు నాయక్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, మైనార్టీ కోటాలో ఎలా భర్తీ చేయాలనేది పార్టీకి సవాల్‌గా మారింది. మైనార్టీ ముస్లిం కోటాలో ఎవరూ ఎమ్మెల్యేలుగా గెలవకపోవడంతో ఈ సమస్య వచ్చింది. దీంతో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ నేతకు ఛాన్స్ ఇచ్చి, క్యాబినెట్‌లోకి తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళా కోటాలోనూ ఒకరికి ఛాన్స్ ఇస్తే బెటర్ అనే పార్టీ నుంచి ఫీడ్ బ్యాక్ ఉన్నది. ఈ కోటా ఇంప్లిమెంట్ చేస్తే ఎమ్మెల్సీ విజయశాంతిని క్యాబినెట్‌లో తీసుకునే ఛాన్స్ ఉన్నది. ఓవరల్‌గా క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ సుదీర్ఘంగా అధ్యయనం చేస్తున్నది. సామాజిక న్యాయం, జిల్లా, పొలిటికల్ ఈక్వేషన్లు బేరీజు చేస్తూ సెలెక్ట్ చేస్తున్నది.

ఎవరు ఇన్.. ఎవరు ఔట్?

క్యాబినెట్ విస్తరణలో పాత మంత్రుల్లో ఇద్దరిని ముగ్గురిని తప్పించే ఛాన్స్ ఉన్నదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వివిధ క్యాస్ట్ ఈక్వేషన్స్‌లో భాగంగానే ఆయా మంత్రులను తొలగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ఎవరిని తొలగిస్తారనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. పక్కకు తప్పిస్తే ఆయా బెర్త్‌లలో ఎవరిని భర్తీ చేస్తారు, తొలగించిన తర్వాత వచ్చే అసంతృప్తులను పార్టీ చల్లారుస్తుందా, ప్రజల్లో ఏ విధమైన ప్రభావం కనిపిస్తుంది, కేడర్‌లో కలిగే కన్‌ఫ్యూజన్, నేతల మధ్య సమన్వయం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం వంటి తదితర వివరాలపై పార్టీ పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నది.

Also Read: Watch Video: ఆహా.. ఇది కదా అసలైన బర్త్‌డే మజా.. మీరూ చూడండి!

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది