Tragic Incident( image credit: twitter)
తెలంగాణ

Tragic Incident: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఆరుగురి గల్లంతు!

Tragic Incident: అప్పటి వరకు వివాహా వేడుకల్లో సంతోషంగా గడిపిన ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. సరద కోసం స్నానానికి గోదావరికి వెళ్లిన యువకులు గల్లంతు అయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో తీవ్ర విషాదం నింపింది. అంబట్ పల్లి సమీపంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎగువన గోదావరి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. స్నానం కోసం ఎనమిది మంది గోదావరి నదిలో దిగగా ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడగా ఆరుగురి ఆచూకీ దొరకలేదు.

బంధువులు కన్నీరు మున్నీరు

గల్లంతు అయిన వారిలో నాలుగురు అంబట్ పల్లికి చెందిన అన్నదమ్ములు పట్టి మధుసుధన్ (18), శివమనోజ్(15), అదే గ్రామానికి చెందిన కర్నాల సాగర్ (16), తొహరి రక్షిత్ (13), అంబట్ పల్లిలో జరిగిన ఓ వివాహ వేడుకకు వచ్చిన కాటారం మండలం కొర్లకుంటకు చెందిన పండు(18), రాహూల్ (19)అనే మరో ఇద్దరు యువకులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, జాలర్ల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకులు నీట మునిగిన విషయం పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహయక చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గోదావరిలో తీరంలో యువకుల తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also ReadKaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి.. అసలు వాస్తవాలేంటి!

వేడుకల్లో పాల్గొన్న వారి కుటుంబాల్లో విషాదం

అనబటిపల్లిలో జరిగిన వివాహా వేడుకల్లో పాల్గొన్న సమీప బంధువులు సరదగా మేడిగడ్డ సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నీట మునిగి గల్లంతు కావడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. వీరిలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు పట్టి వీరస్వామి తన ఇద్దరు కొడుకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. మిగిలిన వారు కూడ వారి సమీప బంధువులే కావడంతో భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. వారి ఆచూకీకోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా వారు గల్లంతు అయిన సమయం బట్టి యువకులు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని స్థానికులు భావిస్తున్నారు.

 Also Read: Deputy CM Bhatti Vikramarka: 2030 నాటికి 20 వేల మెగావాట్ల.. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం!

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు