Deputy CM Bhatti Vikramarka: గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం!
Deputy CM Bhatti Vikramark( image credit: swetcha reporter)
Telangana News

Deputy CM Bhatti Vikramarka: 2030 నాటికి 20 వేల మెగావాట్ల.. గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం!

Deputy CM Bhatti Vikramarka: భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్ దేనని, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యరంగంగా గుర్తించి, ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును ఆయన సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి సంబంధించి రూ.లక్ష కోట్ల విలువైన ఎంవోయూలు జరిగాయని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణ 2025 న్యూ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చిందని, 2029-30 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి

ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికి విద్యుత్ అవసరమని, ఉత్పత్తి పెరగాలంటే విద్యుత్ సరఫరా పుష్కలంగా ఉండాలన్నారు. ఉత్పత్తులు పెరిగితే ఉపాధితో పాటు రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది ఇదంతా ఒక చక్రంలా తిరుగుతుందని డిప్యూటీ సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, కేవలం బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఖర్చు పెరగడంతో పాటు, కాలుష్యం పెరిగి వాతావరణ సవాతుల్యం దెబ్బతింటుందన్నారు.

 Also Read: Young Man Dies: హనీమూన్‌కు వెళ్తున్న వేళ.. రైల్వే స్టేషన్‌లో విషాదం!

పగలు సోలార్ ద్వారా ఉత్పత్తి

ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం గ్రీన్ పవర్ వైపు పరుగులు పెడుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. అన్ని దేశాలు సోలార్ తో పాటు విండ్, థర్మల్, అప్పుడు స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ వంటి మార్గాల ద్వారా విద్యుత్పత్తిని ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నాయని తెలిపారు. పగలు సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ను స్టోరేజీ చేసుకుని, రాత్రివేళ పంప్ డ్ స్టోరేజ్ ద్వారా పీక్ హవర్స్ లో విద్యుత్ ఉత్పత్తి చేసి విదేశాలకు సరఫరా చేస్తున్న గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును కంపెనీ యాజమాన్యం ఆహ్వానం మేరకు గ్రీన్ పవర్ ఉత్పత్తి పరిశీలనకు కర్నూలు జిల్లా పిన్నాపురం గ్రామానికి వచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

4 వేల మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా 1000 మెగావాట్లు

గ్రీన్ కో పవర్ కంపెనీ అనుకున్న సమయానికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం అభినందనీయమన్నారు. వారు 4వేల ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట సోలార్, విండ్, పంప్ డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రపంచంలోనే మొదటిసారి అని కొనియాడారు. గ్రీన్ కో కంపెనీ సోలార్ ద్వారా 4 వేల మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా 1000 మెగావాట్లు, పంప్ డ్ స్టోరేజీ ద్వారా 1,680 మెగావాట్లు మొత్తంగా ఒకే చోట 6,680 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి అభినందించదగిన విషయమని డిప్యూటీ సీఎం కొనియాడారు. దేశంలో భవిష్యత్తులో గ్రీన్ కో వంటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా భాగంగా డిప్యూటీ సీఎం ప్రాజెక్ట్ సైట్‌పై హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. క్లోజ్డ్-లూప్ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్‌కు సంబంధించిన ఎగువ, కింది రిజర్వాయర్లు, పవర్‌హౌస్ కాంప్లెక్స్, ఆధునిక సబ్ స్టేషన్ వంటి కీలక మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

1,680 మెగావాట్ల హైడ్రో పవర్ నిల్వ

గ్రీన్‌కో సంస్థకు చెందిన ఇంజినీర్లు, నిర్వహణ బృందంతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, ఈ ప్రాజెక్టులో సోలార్ పవర్, విండ్ పవర్.. రోజుకు రెండుసార్లు 4 గంటల నిల్వ సామర్థ్యంతో కూడిన 1,680 మెగావాట్ల హైడ్రో పవర్ నిల్వ వ్యవస్థ కలిపి నిర్వహిస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం తన అధికార బృందంతో కలిసి పర్యటించారన్నారు. డిప్యూటీ సీఎం వెంట ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీ హరీశ్, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Medchal: ఏటా వర్షాకాలంలో.. రాకపోకలకు తప్పని తిప్పలు!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..