Thummala Nageswara Rao: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల రాజేందర్ (Etela Rajender) అబద్దాలు చెప్పారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. కమిషన్ కు అసత్యాల వాగ్మూలం ఇచ్చారని మండిపడ్డారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతలేని సమాధానం ఇచ్చారన్న తుమ్మల.. బీఆర్ఎస్ హయాంలో ఆయన వేసిన సబ్ కమిటీ కాళేశ్వరం కోసం కాదని అన్నారు. కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల కోసం సబ్ కమిటీ వేశారని గుర్తుచేశారు.
కాళేశ్వరానికి కేబినేట్ ఆమోదం లేదు
పీసీ ఘోష్ కమిషన్ కు ఈటల రాజేందర్ చెప్పిన సబ్ కమిటీ.. ప్రాణహిత, దేవాదుల, కాంతలపల్లి, తుపాకుల గూడెం పనుల కోసం వేసిందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఆ సబ్ కమిటీ కాళేశ్వరం బ్యారేజీలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పడం అబద్దమని అన్నారు. కాళేశ్వరం సైతం కేబినెట్ ఆమోదం పొందలేదని అన్నారు. కాళేశ్వరం ఎప్పుడూ కేబినెట్ ముందుకు రాలేదని తుమ్మల స్పష్టం చేశారు. పరిపాలన అనుమతులతోనే కాళేశ్వరం అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు.
Also Read: Watch Video: ఆహా.. ఇది కదా అసలైన బర్త్‌డే మజా.. మీరూ చూడండి!
ఈటల అలా ఎందుకు చెప్పారు?
కాళేశ్వరం కమిషన్ ముందు అబద్దాలు ఆడాల్సిన పరిస్థితి ఈటల రాజేందర్ కు ఎందుకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈటెల పట్ల తనకు గౌరవం ఉందని.. కానీ ఆయన ప్రకటన చూసిన తర్వాత కొంత బాధేసిందని పేర్కొన్నారు. తాను స్వయంగా కమిషన్ కు సబ్ కమిటీ రిపోర్ట్ ను ఇవ్వాలి అనుకుంటున్నట్లు తుమ్మల అన్నారు. కమిషన్ వివాదంలోకి నన్ను ఎందుకు లాగాల్సి వచ్చిందో ఈటలనే చెప్పాలని పట్టుబట్టారు. కాళేశ్వరం సబ్ కమిటీ రిపోర్ట్ పై మంత్రి తుమ్మల కూడా సంతకం చేశారని ఇచ్చిన వాగ్మూలం బాధాకరమని అన్నారు.